Allu Arjun: బన్నీ క్రేజ్ మామూలుగా లేదుగా.. రెండు తెలుగు స్టేట్స్‌లో Pushpa-2 ప్రీ రిలీజ్ ఈవెంట్..!!
టాలీవుడ్ స్టార్స్ ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ అండ్ రష్మిక మందన్న కలయికలో తెరకెక్కబోతున్న తాజా చిత్రం ‘పుష్ప ది రూల్’
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్స్ ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్(Iconstar Allu Arjun) అండ్ రష్మిక మందన్న(Rashmika Mandanna) కలయికలో తెరకెక్కబోతున్న తాజా చిత్రం ‘పుష్ప ది రూల్’(Pushpa The Rule). ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ సుకుమార్(Sukumar) దర్శకత్వం వహించారు. పార్ట్-1 ను అద్భుతంగా చూపించడంతో ప్రేక్షకులు సెకండ్ భాగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల(Sreeleela) స్టెప్పులేసిన ఐటెమ్ సాంగ్ రిలీజ్ అవ్వగా.. తాజాగా పీలింగ్ సాంగ్ ప్రోమో వదిలింది చిత్రబృందం.
పోస్టర్లు, ట్రైలర్లు, ప్రోమోలు, సాంగ్స్‌తో ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీ నెలకొంటోంది. ఫహాద్ ఫాజిల్(Fahad Fazil), సునీల్(Sunil), అనసూయ(Jealousy) ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న ఈ పాన్ ఇండియా చిత్రం డిసెంబరు 5 వ తారీకున ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్ప-2 విడుదల నేపథ్యంలో సోషల్ మీడియాలో వరుస అప్డేట్స్ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ఈవెంట్లను పాట్నా(Patna), చెన్నై(Chennai), ముంబయి(Mumbai)లో ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే.
అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. డిసెంబరు(December) 1 వ తారీకున హైదరాబాదు(Hyderabad)లోని మల్లారెడ్డి కళాశాల(Mallareddy College)లో నిర్వహిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. మరో శుభవార్త ఏంటంటే..? ఈ కార్యక్రమానికి దర్శకుడు సుకుమార్(Director Sukumar) కూడా హాజరవ్వనున్నారట. అలాగే చిత్తూరు(Chittoor)లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపనున్నారని సమాచారం. రెండు సార్లు, రెండు వేరు వేరు చోట్ల, రెండు వేరే రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తారట. మరీ ఈ వార్త ఎంత వరకు వాస్తవమూ తెలియదు కానీ నెట్టింట జోరుగా ప్రచారం అవుతోంది.
Read More...
Allu Arjun: వైల్డ్ ఫైర్ ‘పుష్ప-2’ మూవీ సెన్సార్ పూర్తి.. ఏ సర్టిఫికెట్ వచ్చిందంటే? (ట్వీట్)