Dilruba Movie Review: దిల్ రూబా రివ్యూ.. కిరణ్ అబ్బవరం ఖాతాలో హిట్ పడ్డదా లేదా అంటే..?
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran abbavaram) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన ‘దిల్ రూబా’(dilRuba) సినిమాలో నటిస్తున్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran abbavaram) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన ‘దిల్ రూబా’(dilRuba) సినిమాలో నటిస్తున్నాడు. విశ్వకరుణ్(Vishwa Karun) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని.. శివమ్ సెల్యూలాయిడ్ ప్రొడక్షన్స్ అండ్ ప్రముఖ మ్యూజిక్ లేబల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలింతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో రుక్సర్ థిల్లాన్(Rukshar Thillon) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఆకట్టుకొని మూవీపై మరింత క్యూరియాసిటీని పెంచాయి. అలా భారీ అంచనాల నడుమ ఈ చిత్రం నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. మరి కిరణ్ అబ్బవరం హిట్ కొట్టాడో లేదో ఇప్పుడు మనం చూద్దాం..
ఇక సినిమా కథ విషయానికి వస్తే.. సిద్ధార్థ్(కిరణ్ అబ్బవరం) చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి ఫ్రెండ్షిప్ చేసుకుని, ప్రేమించుకున్న మ్యాగీ(క్యాతీ డేవిసన్)తో అనుకోని పరిస్థితుల్లో విడిపోవాల్సి వస్తుంది. అదే సమయంలో సిద్దార్థ్ తండ్రి కూడా చనిపోతాడు. ఆ పరిస్థితుల నుంచి బయటకు రావడానికి మంగళూరు వెళ్లి చదువుకుంటాడు. సిద్ధార్థ్ సారీలు, థ్యాంక్స్‌లు అనేవి చాలా విలువైన పదాలు అవి ఎలా పడితే అలా వాడకూడదు అనే సిద్ధాంతం నమ్ముతాడు. సిద్ధార్థ్ క్యారెక్టర్ నచ్చి కాలేజీలో తన క్లాస్ మేట్ అంజలి(రుక్సర్ థిల్లాన్) ప్రేమిస్తుంది. సిద్దార్థ్ కూడా మ్యాగీని మర్చిపోయి అంజలి ప్రేమలో పడతాడు.
ఆ కాలేజీకి చెందిన విక్కీ(కిల్లి క్రాంతి)తో సిద్దార్థ్‌కి గొడవలు జరుగుతాయి. ఈ క్రమంలో ఆ గొడవలు పోలీస్ స్టేషన్ దాకా వెళ్తాయి. సిద్ధార్థ్ సారీ చెప్పను అనడంతో అనుకోని పరిస్థితుల్లో అంజలి – సిద్దార్థ్ కూడా విడిపోతారు. ఆ తర్వాత పెళ్లి అయి ప్రగ్నెంట్‌గా ఉన్న మ్యాగీ మళ్ళీ సిద్ధార్థ్ లైఫ్ లోకి వస్తుంది. అసలు సిద్దార్థ్ సారీలు, థ్యాంక్స్‌లు ఎందుకు చెప్పడు? సిద్ధార్థ్ – మ్యాగీ ఎందుకు విడిపోయారు? సిద్ధార్థ్ – అంజలి ఎందుకు విడిపోయారు? మళ్లీ వీళ్లిద్దరు కలిసారా? అనేది దిల్ రూబా మూవీ కథాంశం.
సినిమా విశ్లేషణ.. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటన, రుక్సార్ క్యారెక్టరైజేషన్, డైలాగ్స్, విజువల్స్ బాగున్నాయి. అయితే పెద్దగా ట్విస్టులు లేకపోవడం, ఫస్ట్ హాఫ్ రొటీన్‌గా సాగడంతో సినిమా కొంత డల్ అయిందనే చెప్పాలి. అలాగే లవ్ స్టోరీ, ఫ్లాష్ బ్యాక్, ఎమోషన్స్ అంతగా పండలేవనే చెప్పాలి. ఫైనల్‌గా ఈ మూవీ ఓకే ఓకే అన్న టాక్‌తో నడుస్తోంది.
Read More..
HHVM: పవన్ ఫ్యాన్స్‌కు పండుగ లాంటి వార్త.. ఆ రోజే ‘హరిహర వీరమల్లు’ రిలీజ్