samantha ఫిట్‌నెస్‌పై డైరెక్టర్ సెటైర్
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న వారిలో సమంత ఒకరు. ఈ మధ్య కాలంలో మయోసైటిస్ అనే వ్యాధితో సమంత బాధపడిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న వారిలో సమంత ఒకరు. ఈ మధ్య కాలంలో మయోసైటిస్ అనే వ్యాధితో సమంత బాధపడిన విషయం తెలిసిందే. అందులో నుంచి కొంచెం కోలుకుంటున్న సమంత తన ఎక్కువ సమయం జిమ్‌లోనే గడిపేస్తుంది. తన ఫిట్ నెస్‌కు సంబంధించి చేస్తున్న వర్కౌట్స్ కూడా ఎప్పటికప్పడు సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో వీడియో షేర్ చేసింది.
అది కాస్తా వైరల్ అవడంతో దానిపై రకరకాలుగా స్పందించారు నెటిజన్స్. ఈ క్రమంలోనే స్క్రీన్ రైటర్, ఫిల్మ్ డైరెక్టర్ అయిన నందినిరెడ్డి కూడా సమంత ఫిట్ నెస్‌పై సెటైర్ వేస్తూ రిప్లై ఇచ్చారు. ''నువ్వు రెండు చేతులతో చేశావు. అదే నేను అయితే ఒక్క చేతితోనే చేస్తా. నువ్వు ఫీల్ అవుతావనే దానికి సంబంధించిన వీడియో పెట్టలేదు'' అంటూ కామెడీగా కామెంట్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ నందిని రెడ్డి పెట్టిన కామెంట్‌కి సెటైర్లు పేల్చుతున్నారు.
Also Read...
డేటింగ్ రూమర్స్.. ఆ హీరోయిన్‌తో జంటగా ఎంగేజ్‌మెంట్‌కు యంగ్ హీరో!