ఆ సీన్స్‌లో రెచ్చిపోయి చేసిన సమంత, నాగచైతన్యపై కోపంతో, కావాలనే చేసిందా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏమాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ, తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన నటించి

Update: 2024-08-02 12:55 GMT

దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏమాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ, తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. అయితే ఈ బ్యూటీ అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకోవడం, తర్వాత విడాకులు తీసుకోవడం తో సమంత లైఫ్ ఒక్కసారిగా టర్న్ అయ్యింది. ఆ తర్వాత మానసికంగా ఇబ్బందులకు గురి కావడం, మయోసైటీస్ వ్యాధి బారిన పడి ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇక విడాకుల సమయంలోనే సమంత ఐటమ్ సాంగ్ చేసి, బోల్డ్‌గా కనిపించింది. దీంతో ఈమెపై చాలా నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. ఈ క్రమంలోనే చాలా గ్యాప్ తర్వాత సామ్,హానీ బన్నీ వెబ్ సిరీస్ టీజర్ రిలీజ్ అయ్యింది. ఇది నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్‌లోకి రానుంది. అయితే ఈ టీజర్‌లో సామ్ బోల్డ్ సీన్స్ , రొమాంటిక్ సీన్స్ ఎక్కువ ఉన్నట్లు టీజర్ చూస్తే అర్థం అవుతుంది. దీంతో ఇది చూసిన వారందరూ, సమంత కావాలనే నాగచైతన్యపై కోపంతో ఇలాంటి ప్రాజెక్ట్స్ ఒకే చేస్తుంది అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా ఆమె యాక్షన్ మూవీస్‌లో ఎక్కువగా చేస్తుంది. ఇది కూడా నాగచైతన్య కుళ్లు కోవడానికే సమంత ఇలా చేస్తుంది అంటున్నారు కొందరు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Tags:    

Similar News