ఆ కల కారణంగానే చిరు మెగాస్టార్ అయ్యాడా? పేరు మారడానికి కారణం ఇదే..!
తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోగా ఎదిగిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి.
దిశ, వెబ్డెస్క్ : తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోగా ఎదిగిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండస్ట్రీలో ఎన్నో ఒడిదొడుకులను దాటుకొని తన స్వయంకృషితో మెగాస్టార్గా నిలిచారు. అంతే కాదు.. ఆ పేరు కోసం ఆయన ఎన్నో నిద్ర లేని రాత్రలను గడిపారు.
ఎటువంటి సపోర్టు లేకుండా, రాత్రింబవళ్లు కష్టపడి ఆయన స్టార్ హోదా సంపాదించుకున్నారు. ఇదిలా ఉంటే చిరంజీవికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చిరంజీవికి స్టార్ హోదా రావడానికి, మెగస్టార్గా మారడానికి ఓ కారణం ఉన్నదంట. అది ఏమిటంటే.. ఒక కల కారణంగా చిరంజీవి మెగాస్టార్ అయ్యారంట. ఇంతకి ఆ కల ఏంటా అని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిరంజీవికి వచ్చిన కల వెనుక అంత కథ ఉందా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
చిరంజీవి ఒక రోజు రాముల వారి గుడికి వెళ్లినట్లు కల వచ్చిందట. అక్కడ దండం పెట్టుకుంటూ ఉంటే “రా చిరంజీవి వెళదాం” అనే మాట కూడా వినిపించిందట. దీంతో నిద్రలోనే ఉలిక్కిపడి చూసిన చిరంజీవి అక్కడ ఎవ్వరూ లేరట. ఇక ఈ విషయాన్ని చిరు తన అమ్మకు చెప్పడంతో, వాళ్ల అమ్మ చిరంజీవిగా నామకరణం చేసిందంట. చిరంజీవి పేరు శివ శంకర వర ప్రసాద్ అందరికే తెలిసిందే. కానీ ఆ డ్రీమ్ చిరంజీవి లైఫ్ నే మార్చేసింది. దీంతో చిరు లైఫ్ ఒక్కసారిగా టర్న్ అయ్యి, మెగాస్టార్గా మారడంట.