దేవర మూవీ రివ్యూ

ఎన్టీఆర్‌, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన జనతా గ్యారేజ్‌ విజయవంత కావడంతో ఈ కాంబినేషన్‌లో మరో సినిమా కోసం ఎదురుచూశారు. తాజాగా ఈ ఇద్దరి కలయికలో తెరకెక్కిన చిత్రమే దేవర

Update: 2024-09-27 10:24 GMT

నటీనటులు: ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్, సైఫ్‌ అలీఖాన్‌, ప్రకాష్‌రాజ్‌, మురళీశర్మ తదితరులు

దర్శకుడు: కొరటాల శివ, సంగీతం: అనిరుధ్‌, కెమెరా: రత్నవేలు

నిర్మాతలు: నందమూరి కళ్యాణ్‌రామ్‌, మిక్కిలినేని సుధాకర్‌

విడుదల తేది: సెప్టెంబరు 27

న్టీఆర్‌, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన జనతా గ్యారేజ్‌ విజయవంత కావడంతో ఈ కాంబినేషన్‌లో మరో సినిమా కోసం ఎదురుచూశారు. తాజాగా ఈ ఇద్దరి కలయికలో తెరకెక్కిన చిత్రమే దేవర. ఈ ఇద్దరి జోడికి వున్న క్రేజ్‌తో పాటు ఆర్‌ఆర్‌ఆర్‌ తరువాత మూడేళ్లకు ఎన్టీఆర్‌ సినిమా విడుదల కావడం ఇలా పలు అంశాలతో ఈ సినిమాకు మంచి క్రేజ్‌ పెరిగింది. ఈ సినిమాతోనే ప్రముఖ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ తెలుగులో హీరోయిన్‌ ఎంట్రీ ఇస్తుండటం కూడా ఈ సినిమాపై ఆసక్తి పెరగడానికి మరో కారణం. మరి ప్రేక్షకుల ముందుకొచ్చిన దేవర చిత్రం అందరి అంచనాలు అందుకుందా? ప్రేక్షకులను సినిమా ఎంత వరకు అలరించిందో తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాలి.

కథ: ఆంధ్ర, తమిళనాడు బార్డర్‌ల్లోని రత్నగిరి ప్రాంతంలో కొంత భాగాన్ని నాలుగు ఊర్లు కలిసి ఎర్ర సముద్రం అని పేరు. బ్రిటిష్‌ కాలంలో ఈ ఎర్రసముద్రం అనే పేరు రావడానికి తగిన కారణం వుంటుంది. ఈ నాలుగు ఊర్లలో వుండేవాళ్లు జీవనం కోసం దేవర (ఎన్టీఆర్‌) భైర (సైఫ్‌ అలీఖాన్‌) వాళ్ల అనుచరులతో కలిసి ఎర్ర సముద్రంపై వెళుతున్న నౌకల్లో వెళ్లే సరుకును అక్రమంగా పడవల్లో దించుతుంటారు. ఆ నౌకల్లో అక్రమ ఆయుధాల్ని తమ చేత దింపిస్తున్నారని తెలుసుకున్న దేవర ఇకపై ఆ పనులు చేయకూడదని నిర్ణయించుకుంటాడు. బతకడానికి చేపలు పడదామని చెబుతాడు. కానీ ఈ నిర్ణయం భైరవకు నచ్చదు. దాంతో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమవుతుంది. ఇందుకోసం దేవర అడ్డును తొలగించాలనుకుంటాడు భైర. అయితే దేవర మాత్రం ఎవరికి కనిపించకుండా వెళ్లిపోయి భైరవ గ్యాంగ్‌ను ఆ పనులు చేయకుండా అడ్డుకుంటానని చెబుతాడు. దాంతో భయపడిన భైరవ గ్యాంగ్‌ సముద్రంలోకి వెళ్లాలంటేనే భయపడి పోతుంటారు. ఇక ఆ తరువాత ఏం జరిగింది ఈ కథకు దేవర కొడుకు వరకు వున్న సంబంధమేమిటి? తంగం (జాన్వీకపూర్‌)కు ఈ కథకు ఎలా ముడిపడి వుంది అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: ఒక కొత్త నేపథ్యంలో కథను ఎంచుకుని దాని చుట్టూ కొన్ని పాత్రలన క్రియేట్‌ చేసుకుని ఆ పాత్రల మధ్య జరిగే అంతర్యుద్దానికి కాస్త ఎమోషన్స్‌ జోడించే ప్రయత్నం చేశాడు దర్శకుడు కొరటాల శివ. అయితే రాసుకున్న కథలో పాత్రలు బలంగా లేకపోవడంతో సన్నివేశాలు కూడా బలహీనంగానే కనిపించాయి. విజువల్స్‌లో వున్న గ్రాండ్‌నెస్‌ కథలో లేదు. ముఖ్యంగా పాత్రల మధ్య వుండాల్సిన ఎమోషన్‌ మిస్‌ అయ్యింది. నేపథ్యానికి తగినట్టుగా కథలోని పాత్రలు, సన్నివేశాలు మరింత బలంగా రాసుకుని వుంటే ఖచ్చితంగా దేవర అందర్ని అలరించేవాడు. ఎన్టీఆర్‌ పాత్రలోని ఎలివేషన్స్‌, యాక్షన్‌ సన్నివేశాలు మాత్రం ఆకట్టుకుంటాయి. అయితే ఈ సినిమాలో సరైన ప్రతినాయకుడు లేకుండా కథను రాసుకోవడం కూడా పెద్ద మైనసే అని చెప్పాలి. రెండో పార్ట్‌ గురించి ఆలోచించకుండా ఈ కథను మరింత బలంగా రాసుకుంటే దేవర ఫలితం మరింత అనుకూలంగా వుండేది

నటీనటుల పనితీరు: దేవర, వర పాత్రలో ఎన్టీఆర్‌ నటన అలరిస్తుంది. తనదైన శైలిలో ఆ పాత్రలకు జీవం పోశాడు. ముఖ్యంగా దేవర పాత్రలో యాక్షన్‌ సన్నివేశాల్లో ఆయన ఫెరోషియస్‌ యాక్టింగ్‌ ఎన్టీఆర్‌ అభిమానులను మెప్పిస్తుంది. సముద్రమంతా కథను ఎన్టీఆర్‌ తన భుజస్కందాలపై మోశాడు. ఈ చిత్రానికి వున్న బిగ్గెస్‌ ప్లస్‌ అంటే అది కేవలం ఎన్టీఆర్‌ నటన మాత్రమే. భైరవ పాత్రంలో సైఫ్‌ అలీ ఖాన్‌ నటన కూడా బాగానే వుంది. తంగం పాత్రలో అందాల ప్రదర్శన కోసమే వున్నట్లుగా జాన్వీ కపూర్‌ను చూపించారు. ఆమె నటనను చేసే అవకాశం పెద్దగా రాలేదు. మురళీ శర్మ, శ్రీకాంత్‌, ప్రకాష్‌రాజ్‌ తమ పాత్రల్లో పరిధి మేరకు నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు: ముఖ్యంగా ఈ సినిమాకు ఫోటోగ్రఫీ బిగ్గెస్ట్‌ ప్లస్‌ అని చెప్పాలి. రత్నవేలు ఫోటోగ్రఫీ సినిమాలోని కొన్ని మైనస్‌లను కవర్‌ చేసింది. అనిరుథ్‌ నేపథ్య సంగీతం కథ మూడ్‌కు తగిన విధంగా వుంది. యాక్షన్‌ సన్నివేశాల్లో అనిరుధ్‌ బీజీఎమ్‌ అలరిస్తుంది.

ఫైనల్‌గా: దేవర.. ఓన్లీ ఫర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు మాత్రమే.. బాక్సాఫీస్‌ భారమంతా నీదే సోదరా

రేటింగ్‌ : 2.5/5

Tags:    

Similar News