Devara: ‘దేవర’ నుంచి మరో పోస్టర్ విడుదల.. ట్రైలర్ టైమ్ రివీల్

Update: 2024-09-09 09:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దేవర చిత్రం కోసం తారక్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. సెప్టెంబరు 27 వ తారీకున పలు భాషల్లో విడుదలవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్ర ట్రైలర్ రేపు (సెప్టెంబరు 10) రేపు విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా మేకర్స్ ట్రైలర్ విడుదల టైమ్ రివీల్ చేశారు. రేపు సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు విడుదల చేయనున్నారు. టైమింగ్ తో పాటు దేవర నుంచి మరో కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు మరింత జోష్ పెంచారు. ఈ పోస్టర్ లో ఇద్దరు తారక్ లు కనిపిస్తున్నారు. ఒక ఎన్టీఆర్ వెనక్కి తిరిగి ఉన్నారు. మరో ఎన్టీఆర్ ముందుకు చూస్తున్నాడు. దేవర టీమ్ ఈ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ఆకాశం వణికిపోతోంది. అలలు ఎగసిపడుతున్నాయి. తుఫాను నుండి రక్తం కారుతోంది. అత్యంత ఘోరమైన రీతిలో క్రూరమైన మారణహోమానికి సంకేతాలు దేవర, వర రాబోతున్నారు అంటూ క్యాప్షన్ జోడించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 

 


Similar News