సంచలన నిర్ణయం తీసుకున్న డిప్యూటీ CM పవన్ కల్యాణ్.. ఆందోళనలో ఫ్యాన్స్?

జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు.

Update: 2024-07-17 04:28 GMT

దిశ, సినిమా: జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఎన్నో ఫెయిల్యూర్స్ తర్వాత 2024 ఎన్నికల్లో ఎవరూ ఊహించని రేంజ్‌లో అఖండ విజయం సాధించారు. గత పదేళ్లుగా వ్యక్తిగతంగా అనేక విమర్శలు, సవాళ్లను ఎదుర్కొన్న జనసేనాని వాటన్నింటికీ ఈ విజయంతో సమాధానమిచ్చారు. ఇన్నాళ్లు అపజయాలు చవిచూసిన పవర్ స్టార్ ఏనాడు వెనకడుగు వేయకపోవడం గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఆయన కష్టానికి తగ్గ ఫలితం దక్కడంతో ఫ్యాన్స్ ఎగిరిగంతులేశారు.

ఎంచక్కా మూవీస్ తీసుకుంటూ లగ్జరీ లైఫ్‌ను ఎంజాయ్ చేయక, ఈ పాలిటిక్స్ అంటూ తిరగడం అవసరమా? అంటూ హేళన చేసినవారే ఈ రోజు పవన్ కల్యాణ్‌కు చేతులెత్తి దండం పెడుతున్నారు. అయితే ఈ వార్త ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై సెన్సేషనల్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక రీసెంట్ గా ఈయన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడి పెళ్లికి హాజరైన విషయం తెలిసిందే. ఇలా పవర్ స్టార్ ఎక్కడికెళ్లినా 100 సీట్లు ఎలా గెలిచారంటూ అదే ప్రశ్న అడుగుతున్నారు. కాగా తాజాగా దీనిపై స్పందించి.. ‘ఈ విజయం నా ఒక్కడిది కాదు. పార్టీ నాయకులంతా కష్టపడ్డారని తెలిపారు.

జీవితంలో ఎన్నో అవమానాలు భరించాను. ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్ ఓటమి పాలవ్వగానే అసెంబ్లీలో ఉండకుంటా వెంటనే వెళ్లిపోయారు. ప్రతి ఒక్కరిని పరాజయం అంతలా వణుకుపుట్టిస్తుంటుందని వెల్లడించారు. అలాగే తనకు స్పెషల్‌గా ఇన్ని శాఖలు ఎందుకు ఇచ్చాడని అందరికీ ఈ డౌట్ వచ్చే ఉంటుంది. నా మీద నాకు నమ్మకం, ఓ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇప్పుడు దీనిపై నేను ఏం మాట్లాడదల్చుకోలేదు. పలు విధివిధానాలు ఏర్పర్చిన అనంతరం బాధ్యతల నుంచి తప్పుకుంటానని డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు  నెటిజన్లంతా చర్చించుకుంటున్నారు. ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియదు కానీ పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయనున్నారా? అంటూ సోషల్ మీడియాలో అభిమానులంతా ఆందోళన చెందుతున్నారు. మరోవైపు మళ్లీ సినిమాల్లోకి రానున్నారా? అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  


Similar News