పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె .. ఎవరు పుట్టారంటే?
బాలీవుడ్ స్టార్ కపుల్ రణవీణ్ సింగ్ అండ్ దీపికా పదుకొణె నిన్న ముంబయిలోని హెచ్‌ఎన్ రిలయన్స్ హాస్పిటల్‌లో చేరిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ కపుల్ రణవీణ్ సింగ్ అండ్ దీపికా పదుకొణె నిన్న ముంబయిలోని హెచ్‌ఎన్ రిలయన్స్ హాస్పిటల్‌లో చేరిన విషయం తెలిసిందే. ఈ నెల (సెప్టెంబరు)లోనే దీపికాకు వైద్యులు డెలివరీ డేట్ ఇచ్చారు. నిన్న ముంబయిలో సిద్ధి వినాయక ఆలయంలో పూజలు చేసిన తర్వాత ఆస్పత్రికెళ్లగా.. నేడు దీపికా డెలివరీ అయ్యింది. రణ్ వీర్ అండ్ దీపికా పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక దీపికా, రణవీర్ సింగ్ 2018 లో నవంబర్‌లో వివాహం చేసుకొన్న విషయం తెలిసిందే. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో దీపికా గర్భవతి అయ్యింది. సెప్టెంబర్ 2024 అనే క్యాప్షన్ జోడించి.. బేబీ షూస్, దుస్తులతో కూడిన క్యూట్ ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీంతో అభిమానులకు క్లారిటీ వచ్చేసింది.