యంగ్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
యంగ్ హీరోయిన్ కస్తూరి రుక్మిణి వసంత్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె అమ్మమ్మ అనారోగ్య సమస్యలతో మృతి చెందింది.
దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ కస్తూరి రుక్మిణి వసంత్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె అమ్మమ్మ అనారోగ్య సమస్యలతో మృతి చెందింది. ఈ విషయాన్ని తెలుపుతూ కస్తూరి తన ఇన్‌స్టా వేదికగా తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ‘‘ఆగస్టు 23న తెల్లవారుజామున నేను నా అద్భుతమైన అమ్మమ్మను కోల్పోయాను. నేను ఆమె గురించి చాలా విషయాలు చెప్పగలను. కానీ ఆమె ఎంత ధైర్యవంతురాలో ఎన్ని తెలివితేటలు ఉన్నాయో ఎవరూ స్పష్టంగా చెప్పలేరు. నేను ఆమె లాగా ఎదగగలనని ఆశిస్తున్నాను. ఆమె నుండి పాత ఫోటోగ్రాఫ్‌లను సేకరించి స్క్రాప్‌బుక్ చేయడం అమ్మమ్మను చూసి నేర్చుకున్నాను.
అయితే ఆమె ఆల్బమ్‌లపై చాలా సమయం గడిపాను. అక్కడ ఆమె తనకు ఇష్టమైన వారి జీవితాలను రికార్డ్ చేసింది. నిన్న, మేమంతా కూర్చుని ఆ ఆల్బమ్‌లను చూసాము. ఆమె గురించి మా అభిప్రాయాలను పంచుకోవడంతో పాటు జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఏడ్చాము. ప్రతిదానికి అమ్మమ్మకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను చాలా కృతజ్ఞురాలిని.’’ అని నోట్ రాసుకొచ్చింది. కాగా, ఈ అమ్మడు తెలుగులో ‘సప్త సాగరాలు దాటి’ ప్రేక్షకు ముందుకు వచ్చింది. అలాగే కస్తూరి కాంతార: చాప్టర్-1లో కూడా ఆమెకు ఆఫర్ వచ్చినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.
(Video Link Credits to rukmini vasanth Instagram Channel)