ఓటీటీలోకి రాబోతున్న డార్లింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

ఇస్మార్ట్ బ్యూటీ నభానటేష్, ప్రియదర్శి జంటగా నటించిన చిత్రం డార్లింగ్. అశ్విన్ రామ్ దర్శకత్వంలో స్ప్లిట్ పర్సనాలిటీ డిజాస్టర్ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం రోజున థియేటర్లలో విడుదలై పర్వాలేదనిపిస్తోంది.

Update: 2024-07-20 04:12 GMT

దిశ, సినిమా : ఇస్మార్ట్ బ్యూటీ నభానటేష్, ప్రియదర్శి జంటగా నటించిన చిత్రం డార్లింగ్. అశ్విన్ రామ్ దర్శకత్వంలో స్ప్లిట్ పర్సనాలిటీ డిజాస్టర్ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం రోజున థియేటర్లలో విడుదలై పర్వాలేదనిపిస్తోంది.

ఇక ఈ సినిమాలో అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటించగా, రఘుబాబు, మురళీధర్ గౌడ్, బ్రహ్మానందం కూడా ముఖ్యపాత్రలు పోషించారు. కాగా, ఈ సినిమా విడుదలై రెండు రోజులకే ఈ సినిమా హక్కులను డిస్నీ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. దీంతో మూవీ త్వరలో ఓటీటీలో సందడి చేయడానికి రెడీ అయ్యింది. డార్లింగ్ మూవీ ఆగస్టు రెండో వారం లేదా, మూడో వారంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో తెలుగు, తమిళ, కన్నడ , హిందీ బాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.


Similar News