OTT Movie: ఓటీటీలోకి డార్క్ సస్పెన్స్ మూవీ..చావును సెలబ్రేట్ చేసుకునే వింత ఫ్యామిలీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఈ మధ్య కాలంలో ఓటీటీ హవా ఎంతగా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Update: 2024-07-29 06:11 GMT

దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో ఓటీటీ హవా ఎంతగా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే చాలా సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలో సందడి చేస్తున్న విషయం తెలిసిందె. కరోనా తర్వాత చాలా మంది ఓటీటీ వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం థియోటర్స్‌కు వెళ్లి మూవీ చూడటానికి ఎవరూ కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తలేరు. ఎందుకంటే థియోటర్స్‌కు వచ్చిన 15 నుంచి 20 రోజుల్లో ఓటీటీకి వచ్చేస్తుంది. అలాగే తక్కువ ఖర్చుతో పాప్ కార్న్ లాంటి స్నాక్స్‌ను పెట్టుకొని ఎంచక్కా కుటుంబం మొత్తం కుర్చోని మూవీ చూడొచ్చు. అయితే వీటిలో ప్రసార మయ్యో సినిమాలు కూడా చాలా జోనర్లు ఉంటాయి. అందులో ముఖ్యంగా సస్పెన్స్, హారర్, ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్, సోషల్ ఇన్స్పైర్, మోస్ట్ డిస్ట్రబెన్స్, రొమాంటిక్, డార్క్ కామెడీ మూవీ అంటూ పలు రకాల జోనర్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు చెప్పబోయో మూవీ డార్క్ కామెడికి జోనర్‌కు సంబంధించినది. కాకపోతే కామెడీతో పాటు ప్రతి నిమిషం సస్పెన్స్‌తో ఆసక్తి కలిగేలా చేస్తుంది. మరి ఈ మూవీ నేమ్ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను ఇప్పుడు చూసేయండి.

ఈ సినిమా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సాధారణంగా చావు అనే మాట వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. కానీ సినిమాలో మాత్రం ఏకంగా ఓ ఫ్యామిలీ చావబోతున్నాం అని తెలిసి కూడా సెలబ్రేట్ చేసుకుంటుంది. పైగా అక్కడ జనాలు చనిపోవడానికి ప్రభుత్వమే దగ్గర ఉండి మందులు పంచుతుంది. మరికొన్ని క్షణాల్లో చనిపోతున్నాం అని తెలిసినా ప్రజలంతా పార్టీ చేసుకోవడం అంటే విడ్డూరమే కదా. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ పేరు ‘సైలెంట్ నైట్’. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇక సినిమా కథ విషయానికి వస్తే…

ఈ మూవీలో నెల్, సైమన్ అనే ఇద్దరు భార్యాభర్తలకు ముగ్గురు పిల్లలు ఉంటారు. అందులో ఆర్ట్ అనే పేరుతో ఒక కొడుకు ఉంటాడు. అయితే క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతుండడంతో ఫ్రెండ్స్‌ని కూడా ఇన్వైట్ చేస్తారు. ఆ పార్టీకి ఈ ఫ్యామిలీతో పాటు మరో ముగ్గురు కపుల్స్ కూడా హాజరవుతారు. అందులో ఒకరికి కూతురు ఉంటుంది. క్రిస్మస్ పార్టీ అంటే ఎంత హడావిడి ఉంటుందో అందరికీ తెలిసిందే. కానీ వీళ్ళ ఇంట్లో మాత్రం ఒక్కరు కూడా సంతోషంగా ఉండరు. ఇక డిన్నర్ టైం లో కూడా ఎవరు కడుపు నిండా ఆహారం తినరు. మరోవైపు విషపూరిత గ్యాస్ లీకేజ్ కారణంగా చాలా మంది చనిపోతారు. ఆ గ్యాస్‌ను ఆపడానికి ఎంత ప్రయత్నించినా కంట్రోల్ కాదు. దీంతో ఆ గ్యాస్ వల్ల బాధపడుతూ చనిపోవడం కంటే ఎలాంటి నొప్పి లేకుండా ముందే చనిపోవడం బెటర్ అని అందరూ ఫీల్ అవుతారు. ఇక ఆ గ్యాస్‌ను కట్టడి చేయాల్సిన ప్రభుత్వమే ఏకంగా జనాలు చనిపోవడానికి ఎగ్జిట్ పిల్స్ అనే పేరుతో మందులు ఇస్తుంది. ఎలాంటి బాధను అనుభవించకుండా చనిపోవాలి అనుకున్న వాళ్ళు వాటిని వేసుకుని చనిపోతారు. వీటి కోసమే సైమన్, నెల్ ఈ పార్టీని ఏర్పాటు చేస్తారు. ఆ పార్టిలో ఈ మందుతో ఫ్యామిలీ అంతా చావలి అని డిసైడ్ అవుతారు. కానీ వీళ్ళ కొడుకు ఆర్ట్ మాత్రం ఆ మందును వేసుకోవడానికి ఒప్పుకోడు. మరి చివరికి ఈ ఫ్యామిలీ చనిపోయిందా? ఆ గ్యాస్ రిలీజ్ కాకుండా ఎవరైనా ఆపగలిగారా? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే ‘సైలెంట్ నైట్’ అనే మూవీని చూడాల్సిందే. మరి ఇంకేందుకు ఆలస్యం వెళ్లి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని చూసేయండి.

Tags:    

Similar News