sai pallavi :ఆ వెబ్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సాయిపల్లవి?
భాషతో సంబంధం లేకుండా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి.
దిశ, సినిమా: భాషతో సంబంధం లేకుండా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. తక్కువ సమయంలో మంచి కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఈ మధ్య కాలంలో తన నుంచి ఒక ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేయలేదు. అంటే ఆమెకు అవకాశాలు రావడం లేదు అని కాదు.. నచ్చిన కథలు రాలేదు అని అర్థం చేసుకోవాలి.
ఎందుకంటే క్యారెక్టర్ పరంగా తనకు అనుకూలంగా ఉంటే తప్ప సినిమాను ఒప్పుకోదు. అయితే తాజా అప్‌డేట్ ప్రకారం ఒక తెలుగు వెబ్ సిరీస్ చేయనుందని టాక్ వినిపిస్తోంది. శేఖర్ కమ్ముల శిష్యుడు ఒక వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేశాడట. ఈ కథకు సాయి పల్లవి అయితేనే క్యారెక్టర్‌కి బాగా సూట్ అవుతుందని భావించి ఆమెను సంప్రదించారట. స్టోరీ నచ్చడంతో సాయి పల్లవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.