నా జీవన రేఖ తానేనంటూ ఆమె గురించి ఆసక్తికర పోస్ట్ పెట్టిన చిరంజీవి.. మెగా ఫ్యాన్స్ ఫిదా!

మెగా స్టార్ చిరంజీవి ఇటీవల పద్మవిభూషణ్ అవార్డు దక్కించుకుని ప్రముఖుల చేత ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే.

Update: 2024-02-18 10:04 GMT

దిశ, సినిమా: మెగా స్టార్ చిరంజీవి ఇటీవల పద్మవిభూషణ్ అవార్డు దక్కించుకుని ప్రముఖుల చేత ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత సినీ ప్రముఖులకు గ్రాండ్‌గా పార్టీ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ‘విశ్వంభర’ సినిమా షూటింగ్‌లో ఉన్నారు. అయినప్పటికీ ఇటీవల గ్యాప్ తీసుకుని మరీ వెకేషన్‌కు అమెరికా వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చారు. చిరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు చేస్తుంటారు.

తాజాగా, చిరంజీవి భార్య పుట్టిన రోజు కావడంతో ఆయన ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేశారు. ‘‘ నా జీవన రేఖ.. నా సౌభాగ్య రేఖ.. నా భాగస్వామి సురేఖ ! పుట్టిన రోజు శుభాకాంక్షలు’’ అంటూ రాసుకొచ్చాడు. అంతేకాకుండా ఇద్దరు కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశాడు. భార్యపై తనకున్న ప్రేమను కవిత రూపంలో బయటపెట్టడంతో మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

అలాగే అదిరిందంటూ చిరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా సురేఖ పుట్టిన రోజు సందర్భంగా మెగా ఫ్యామిలీ ఓ బిజినెస్ కూడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ‘‘అత్తమ్మ కిచెన్’’ అనే పేరు పెట్టినట్లు టాక్. దీంతో ఈ విషయం తెలిసిన వారంతా వెయిట్ చేయలేకపోతున్నాము సురేఖ చేసిన వంటలు తినాలని అంటున్నారు.


Similar News