జర్నలిస్ట్ ప్రాణం కాపాడిన చిరంజీవి.. దట్ ఈజ్ మెగాస్టార్ అంటున్న ఫ్యాన్స్
మెగాస్టార్ చిరంజీవి హెల్పింగ్ గురించి అందరికి తెలిసిందే.
దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి హెల్పింగ్ గురించి అందరికి తెలిసిందే. కరోనా వంటి సమయంలో సినీ కార్మికులకు, అభిమానులకు అండగా నిలిచారు. అంతే కాకుండా ఇండస్ట్రీలో పెద్దగా ఉన్న ఈయన అనేక ట్రస్ట్‌ల ద్వారా ఎంతో మందికి సహాయంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే మరోసారి తన గొప్ప మనసు చాటు కున్నారు. అసలు విషయంలోకి వెళితే.. ప్రముఖ సీనియర్ సినిమా జర్నలిస్ట్ ప్రభు ఇటీవల తీవ్ర అనారోగ్యంతో బాధపడిన విషయం తెలిసిందే. మెడికల్ టెస్టులు చేయించుకోగా హార్ట్‌లో 80 శాతం బ్లాకులు ఉన్నట్లు తేలింది.
ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు యాంజియో గ్రామ్ చేసి బైపాస్ చేయాలని సూచించారట. ఈ విషయంలో చిరంజీవిని జర్నలిస్ట్ ప్రభు సంప్రదించగా.. వెంటనే స్పందించిన ఆయన తనకు బాగా పరిచయమున్న స్టార్ హాస్పటల్ వైద్యులకు ఫోన్ చేసి ప్రభుని అడ్మిట్ చేయించారట. ఆ హాస్పటల్ వైద్యులు బైపాస్ సర్జరీ చేయాల్సిన పని లేకుండా.. కేవలం స్టంట్స్ వేసి సమస్యను క్లియర్ చేశారని తెలుస్తోంది. చికిత్స విషయంలో ప్రభుని హాస్పటల్లో ఒక్క రూపాయి కూడా కట్టనివ్వకుండా అన్ని తానై చూసుకున్నారట చిరంజీవి. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ కావడంతో దట్ ఈజ్ చిరంజీవి అంటూ కామెంట్లు పెడుతున్నారు మెగా ఫ్యాన్స్.