కేరళ వయనాడ్ బాధితులకు చిరంజీవి, రామ్ చరణ్ భారీ విరాళం.. ఎంతంటే?

కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటన దేశాన్ని విషాదంలోకి నెట్టేసింది.

Update: 2024-08-04 09:21 GMT

దిశ, సినిమా: కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటన దేశాన్ని విషాదంలోకి నెట్టేసింది. ఈ సంఘటనలో ఏకంగా 358 మంది ప్రాణాలు కోల్పోగా.. ఏకంగా 518 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఇంకా మరికొద్ది మంది తప్పిపోయిన వారి ఆచూకీ దొరకలేదు. ఇందులో నష్టపోయిన బాధిత కుటుంబాలకు చాలామంది కోలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లు తమ వంతు సహాయం చేశారు. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా రూ. 25 లక్షలు ఇచ్చారు.

తాజాగా, మెగా హీరోలు చిరంజీవి, రామ్ చరణ్ అండగా నిలిచారు. వీరిద్దరు కలిసి CMRF కు రూ. కోటి విరాళం అందిస్తున్న చిరంజీవి ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అంతేకాకుండా ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. ‘‘గత కొన్ని రోజులుగా ప్రకృతి ప్రకోపానికి కేరళలో జరిగిన విధ్వంసం, వందలాది విలువైన ప్రాణాలు కోల్పోయినందుకు తీవ్ర మనోవేదనకు గురయ్యా. వయనాడ్ దుర్ఘటన బాధితులకు నా హృదయం వెల్లివిరుస్తోంది. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు చరణ్‌, నేను కలిసి రూ.1 కోటి విరాళంగా అందజేస్తున్నాం. బాధలో ఉన్న వారందరూ కోలుకోవాలని నా ప్రార్థనలు తెలుపుతున్నాను’’ అని రాసుకొచ్చాడు.

Tags:    

Similar News