నా వక్షోజాలను ఒక సరుకులాగా మార్చేశారు: నటి Chhavi Mittal ఎమోషనల్ పోస్ట్
టెలివిజన్ నటి ఛవీ మిట్టల్ తన వక్షోజాలపై వస్తున్న ట్రోలింగ్‌ను తిప్పికొట్టింది.
దిశ, సినిమా : టెలివిజన్ నటి ఛవీ మిట్టల్ తన వక్షోజాలపై వస్తున్న ట్రోలింగ్‌ను తిప్పికొట్టింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా పింక్ బికినీ ధరించి బీచ్‌లో తెగ ఎంజాయ్ చేసిన ఆమె..ఇందుకు సంబంధించిన ఫొటోలను నెట్టింట షేర్ చేసింది. అయితే గతేడాది రొమ్ము క్యాన్సర్‌తో బాధపడిన నటి.. తాజా వీడియోల్లో తన వక్షోజాలనే హైలెట్ చేయడం చర్చనీయాంశమైంది. దీంతో బూబ్స్ సైజ్ కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందంటూ కొతమంది అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కొన్ని స్క్రీన్‌షాట్‌లను పంచుకుంది. 'నా వక్షోజాలు ఒక వస్తువులాగా చర్చించబడుతున్నాయి. స్త్రీల బ్రెస్ట్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ఏం జరుగుతుందో తెలుసుకోండి. లోపల క్యాన్సర్ గడ్డను మాత్రమే తొలగిస్తారు. నాకు అధునాతన సాంకేతికతతో పునర్నిర్మాణ శస్త్రచికిత్స జరిగింది. ఎదలు మునుపటిలా కనిపించేలా (లాటిస్సిమస్ డోర్సీ) కొన్ని కండరాల భాగాన్ని కత్తిరించి సెట్ చేశారు' అని చెప్పుకొచ్చింది. అలాగే ఇది తనకు కొత్త జీవితామన్న ఛవీ..తన తప్పు లేకున్నా ఎదుర్కొంటున్న కాంట్రవర్సీ కామెంట్స్ చూసి గత ఏడు నెలలుగా ప్రతి రోజు ఏడుస్తున్నానని చెప్పుకొచ్చింది.
Read more:
తల్లి కాబోతున్న నటి..బేబీ బంప్ ఫొటోస్ వైరల్