'వెడ్డింగ్ డే' : రాయల్ లుక్స్‌లో చరణ్, ఉపాసన

దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన నేడు తమ 10వ వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు..Latest Telugu News

Update: 2022-06-15 07:49 GMT

దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన నేడు తమ 10వ వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మూడు రోజుల ముందు నుంచే ఈ సందడి మొదలవగా.. చరణ్, ఉపాసన జంటగా ఉన్న లేటెస్ట్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

సంప్రదాయ వస్త్రధారణలో రాయల్‌గా కనిపిస్తున్న రెండు చిత్రాలను పోస్ట్ చేయగా.. సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు అందుతున్నాయి. 'మీ ఇద్దరికీ హ్యాపీ హ్యాపీ యానివర్సరీ.. మా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి' అంటూ మహేశ్ వైఫ్ నమ్రత పోస్టు చేసింది. ఇక మెగా హీరో వరుణ్ తేజ్ మూడు హార్ట్ ఎమోజీలతో విష్ చేయగా.. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా 'హ్యాపీ యానివర్సరీ గైస్' అని, కాజల్ అగర్వాల్ 'వార్షికోత్సవ శుభాకాంక్షలు! ప్రేమ, నవ్వుతో మీ ఇద్దరు జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుంటున్నానని విషెస్ తెలియజేశారు.


Similar News