'చీరకు నిప్పంటుకొని చలపతి రావు భార్య మృతి'
ప్రముఖ సీనియర్ నటుడు చలపతి రావు గుండెపోటుతో శనివారం తెల్ల వారు జామున తుది శ్వాస విడిచారు. ఇక ఈయన మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటని చెప్పవచ్చు.
దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ సీనియర్ నటుడు చలపతి రావు గుండెపోటుతో శనివారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. ఈయన మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటని చెప్పవచ్చు.
చలపతి రావు కృష్ణా జిల్లా బల్లి పర్రులో 1944 మే8న వియ్యమ్మది, మణియ్య దంపతులకు జన్మించారు. ఈయనకు 19ఏళ్లకే వివాహం జరగగా, 28వ ఏట మద్రాస్‌లోని ఇంట్లో చీరకు నిప్పంటుకొని చలపతి రావు భార్య మృతి చెందినట్లు సమాచారం. అప్పటికే వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు.
ఎన్టీఆర్ ప్రోత్సాహంతో సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన చలపతి రావు 1200 సినిమాలకు పైగా నటించారు. ఈయన నటించిన మొదటి చిత్ర గూఢచారి 116. ఇక చలపతిరావు, అనారోగ్యంతో గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.
Also Read..