చిరంజీవికి ఉన్న ఆ అలవాటు చూస్తే నవ్వు ఆపుకోలేరు?

మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన తన స్వయం కృషితో చిత్ర పరిశ్రమలో అడ్డంకులు, కష్టాలను దాటుకొని, మెగాస్టార్ రేంజ్‌కు ఎదిగాడు. దీంతో చాలా మంది ఆయనను ఇన్‌స్పైర్‌గా తీసుకుంటారు.

Update: 2024-04-12 10:55 GMT

దిశ, సినిమా : మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన తన స్వయం కృషితో చిత్ర పరిశ్రమలో అడ్డంకులు, కష్టాలను దాటుకొని, మెగాస్టార్ రేంజ్‌కు ఎదిగాడు. దీంతో చాలా మంది ఆయనను ఇన్‌స్పైర్‌గా తీసుకుంటారు.

అయితే తాజాగా విజయ్ దేవరకొండ, చిరును తన కెరీర్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను అడిగి తెలుసుకున్నాడు. ఈ క్రమంలో విజయ్ మాట్లాడుతూ..నేను హీరోగా రాణిస్తున్నా, నాలో ఇంకా మిడిల్ క్లాస్ పోలేదు, నేను ఇప్పటికీ స్నానం చేస్తున్నప్పుడు షాంపూ బాటిల్‌లో షాంపూ అయిపోతే, దాంట్లో నీళ్లు పోసి షేక్ చేసి వాడుతాను అని చెప్పారు. దీంతో చిరు మాట్లాడుతూ.. నాకు ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు ఉన్నాయని, సాధారణంగా సబ్బు అయిపోతే ఎవరైనా కొత్తది తీసుకుంటారు. కానీ ఆ చిన్న ముక్కలనే నేను సోపుగా వాడుతాను, అంతే కాకుండా ఇంట్లో లైట్స్, గ్రీజర్ ఆపకుండా వెళ్లారేమో అని నిత్యం చెక్ చేస్తాను అని చెప్పుకొచ్చారు. ఇక చిరంజీవి అలవాట్లు చూసి నెటిజన్స్ షాక్ అవ్వడమే కాకుండా, చిరుకు ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా అని నవ్వుకుంటున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.


Similar News