బాక్సాఫీస్ ఆన్ ఫైర్.. కలెక్షన్లలో సునామి సృష్టిస్తున్న ‘కల్కి’

దేశ వ్యాప్తంగా ‘కల్కి 2898AD’ మూవీ మానియా కొనసాగుతోంది.

Update: 2024-07-06 08:33 GMT

దిశ, సినిమా: దేశ వ్యాప్తంగా ‘కల్కి 2898AD’ మూవీ మానియా కొనసాగుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అందుకుని భారీ కలెక్షన్లు రాబడుతోంది. అంతే కాకుండా విడుదలైన నాలుగు రోజుల్లోనే దాదాపు రూ. 600 కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. తాజాగా 10 రోజుల్లో రూ. 800 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ.. ‘బాక్సాఫీస్ ఆన్ ఫైర్’ అనే క్యాప్షన్ ఇచ్చి రూ. 800 కోట్లకు పైగా రాబట్టినట్లు తెలిపారు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో రూ. 800 కోట్లు రాబట్టిన చిత్రాల్లో కల్కి మూడో సినిమాగా నిలిచింది.


Similar News