Bollywood ల‌వ్ బ‌ర్డ్స్ Siddharth, Kiara..మ్యారేజ్ డేట్ ఫిక్స్ !

కొత్త సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన మరో ప్రముఖ జంట పెళ్లికి సన్నాహాలు మొదలు పెట్టింది.

Update: 2022-12-31 05:43 GMT

దిశ, సినిమా : కొత్త సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన మరో ప్రముఖ జంట పెళ్లికి సన్నాహాలు మొదలు పెట్టింది. బాలీవుడ్ ల‌వ్ బ‌ర్డ్స్ సిద్ధార్థ్ మ‌ల్హోత్రా, కియారా కొన్నాళ్లుగా డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరి రిలేషన్‌పై జోరుగా వార్తలు వచ్చాయి. ఇటీవ‌ల ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ..తాను త్వర‌లోనే పెళ్లి చేసుకోనున్నట్లు కియారా వెల్లడించింది. కాగా ఈ ప్రేమ ప‌క్షులు ఫిబ్రవ‌రిలో పెళ్లి పీట‌లెక్కబోతున్నట్లు స‌మాచారం. ఫిబ్రవ‌రి 4 నుంచి 6 వ‌ర‌కు సిద్ధార్గ్, కియారాల పెళ్లి జ‌రుగ‌నున్నట్లు, రాజ‌స్థాన్‌లోని జైస‌ల్మేర్ ఫోర్ట్‌ను పెళ్లి వేదిక‌గా ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది. కుటుంబ‌ స‌భ్యులు, స‌న్నిహితుల‌తో పాటు కొద్ది మంది బాలీవుడ్ ప్రముఖులు సిధ్‌, కియారా పెళ్లికి హాజ‌రుకాబోతున్నట్లు తెలిసింది. ఈ గుడ్ న్యూస్‌ని జ‌న‌వ‌రిలో అఫీషియ‌ల్‌గా ఈ జంట ప్రక‌టించే అవ‌కాశం ఉంది.

Also Read..

తల్లి కాబోతున్న హీరోయిన్ పూర్ణ ! 

Tags:    

Similar News