Big shock: ఏకంగా 18 యూట్యూబ్ చానల్స్‌ను బ్యాన్ చేయించిన ‘మా అసోసియేషన్’
ఇటీవల ఓ తండ్రీ కూతురు వీడియోపై నటుడు ప్రణీత్ హనుమంత్ చేసిన కామెంట్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
దిశ, సినిమా: ఇటీవల ఓ తండ్రీ కూతురు వీడియోపై నటుడు ప్రణీత్ హనుమంత్ చేసిన కామెంట్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై మంచు విష్ణు, సాయి ధరమ్ తేజ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంచు మనోజ్ తమదైన శైలీలో రియాక్ట్ అయి పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. మంచు విష్ణు ఇలాంటి కోవకు చెందిన వీడియోలు చేయడంపై కొన్ని చానల్స్‌పై ఫైర్ అయిన విషయం తెలిసిందే. అంతేకాకుండా 48 గంటల్లో ఈ వీడియోలు తొలగించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించాడు. అలాగే 5 చానల్స్‌ను క్లోజ్ చేయించాడు.
ఇదిలా ఉంటే.. తాజాగా, మా అసోసియేషన్ ట్విట్టర్ వేదికగా మరోసారి 18 చానల్స్‌ను బ్యాన్ చేయించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. మా కళాకారులపై అవమానకరమైన కంటెంట్‌ను పోస్ట్ చేసినందుకు YouTube చానల్స్‌ను రద్దు చేయడానికి మా కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా హానికరమైన కంటెంట్‌ని వ్యాప్తి చేసే అదనపు 18 చానల్స్‌ను మేము బ్లాక్ చేసాము. మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి’’ అని రాసుకొచ్చింది.
అలాగే మరో పోస్ట్‌లో ‘‘MAA తరఫున, మేము అన్ని యూట్యూబర్లు, సోషల్ మీడియా ట్రోలర్లను గమనించాము. పరువు నష్టం కలిగించే ట్రోల్ వీడియోలను సైబర్ క్రైమ్ కార్యాలయానికి నివేదించడానికి మేము సిద్ధమవుతున్నాము. సంక్లిష్టతలను నివారించడానికి దయచేసి మీ చానల్స్, ప్రొఫైల్‌ల నుంచి అటువంటి కంటెంట్‌ను తీసి వేయండి’’ అని మిగతా చానల్స్‌కు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజెంట్ ఈ రెండు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.