గ్రాండ్‌గా లాంచ్ అయిన "అవసరానికో అబద్దం" సినిమా

మనిషి జీవితంలో నిజానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అబద్దానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉందని చెప్పే సందేశాత్మక చిత్రమే "అవసరానికో అబద్ధం".

Update: 2023-02-25 10:52 GMT

దిశ, సినిమా: మనిషి జీవితంలో నిజానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అబద్దానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉందని చెప్పే సందేశాత్మక చిత్రమే "అవసరానికో అబద్ధం". త్రిగున్, రుబాల్ షేక్ రావత్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రానికి కృష్ణమూర్తి యలమంచిలి, డాక్టర్ జై యలమంచిలి నిర్మాత కాగా.. అయాన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజు, తెలుగు నిర్మాతల మండలి ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్, నిర్మాత సురేష్ బాబు, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ దామోదర్ కోలేటి, చిత్ర నిర్మాత సోదరుడు రమేష్ యలమంచిలి, విజయవాడ తూర్పు వై. సి. పి. ఇంచార్జ్ దేవినేని అవినాష్, ఆంధ్రప్రదేశ్ బి. జే. పి సెక్రటరీ నాగభూషణం పాతూరి, బి. జే. పి నేషనల్ ఫైనాన్సియల్ స్పోక్ పర్సన్ లంకా దినకర్, రాజేంద్ర ఎనిగల్ల, శంకర్ చెన్నం శెట్టి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టగా, తెలుగు నిర్మాతల మండలి ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాత సురేష్ బాబు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన డైరెక్టర్ అయాన్.. ధర్మాన్ని కాపాడాలంటే ధర్మరాజుతోనే అబద్ధం చెప్పించాలనే హీరో పాత్ర ఆసక్తికరంగా ఉంటుంది అన్నారు. పుట్టిన తర్వాత అమ్మ పెట్టే గోరుముద్దల నుంచి చనిపోయే క్షణం వరకు ప్రతీ చోటా అబద్దం కీలక పాత్ర పోషిస్తుందని, ఈ ఆలోచనను కమర్షియల్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని వివరించారు.

Tags:    

Similar News