గేమ్ మార్చడానికి వస్తున్నానంటూ.. ‘గేమ్ ఛేంజర్’ అప్డేట్ ఇచ్చిన రామ్ చరణ్.. ఖుషీలో ఫ్యాన్స్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్స్ సుకుమార్, బుచ్చిబాబులతో రెండు సినిమాలో లైన్‌లో పెట్టాడు.

Update: 2024-07-08 02:42 GMT

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్స్ సుకుమార్, బుచ్చిబాబులతో రెండు సినిమాలో లైన్‌లో పెట్టాడు. ప్రజెంట్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే దీని షూటింగ్ స్టార్ట్ అయి కూడా మూడేళ్లు పూర్తి అయినప్పటికీ థియేటర్స్‌లో రిలీజ్ కాకపోవడంతో.. ఫ్యాన్స్ ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచాయి. కానీ ఇన్నాళ్ల నుండి రిలీజ్ డేట్ చాలా సార్లు వాయిదా పడుతూ వస్తుండటంతో సినీ ప్రియులంతా నిరాశలో ఉన్నారు.

ఈ క్రమంలో.. ఇటీవల శంకర్ షూటింగ్ పూర్తి అయినట్లు ఇంకా 15 రోజులు మాత్రమే ఉంది తొందరలో రిలీజ్ అవుతుందని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా, మెగా హీరో రామ్ చరణ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టి ఫ్యాన్స్ ఆనందానికి కారణం అయ్యాడు. రెండు హెలికాప్టర్లతో షూటింగ్ సమయంలో తీసుకున్న ఫొటోలను షేర్ చేశాడు. అందులో చెర్రీ లుక్స్ అదిరిపోయాయి. ఈ పోస్ట్‌కు ‘‘గేమ్ ఛేంజ్ చేయడానికి గేమ్ ఛేంజర్‌తో వస్తున్నా. అది ఒక చుట్టం. సినిమాతో కలుద్దాం’’ అనే క్యాప్షన్ జత చేశాడు. ప్రజెంట్ గ్లోబల్ స్టార్ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక అది చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతూ.. వెయిటింగ్ అన్నా అని ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు. కాగా, ఈ మూవీ సెప్టెంబర్ 27న విడుదల కానున్నట్లు సమాచారం.


Similar News