సెలబ్రిటీలు వేసుకునే బట్టలు వాళ్లవి కాదా.. వైరల్ అవుతున్న న్యూస్!
సెలబ్రిటీలు వేసుకునే డ్రెస్సులు చూస్తే వావ్ అనిపిస్తుంది కదా. వారు ఒక్కో డ్రెస్‌లో కనిపించి అందరినీ ఆకట్టుకుంటారు. ఒక్కో ఫోటోలో ఒక్కో డ్రెస్‌తో కుర్రకారును మాయ చేస్తారు. అయితే చాలా వరకు ప్రతి ఒక్కరూ
దిశ, సినిమా : సెలబ్రిటీలు వేసుకునే డ్రెస్సులు చూస్తే వావ్ అనిపిస్తుంది కదా. వారు ఒక్కో డ్రెస్‌లో కనిపించి అందరినీ ఆకట్టుకుంటారు. ఒక్కో ఫోటోలో ఒక్కో డ్రెస్‌తో కుర్రకారును మాయ చేస్తారు. అయితే చాలా వరకు ప్రతి ఒక్కరూ ఆ డ్రెస్స్ వారివే అనుకుంటారు. కానీ నిజానికి ఆ డ్రెస్స్ వారివి కాదంట. తాజాగా దీనికి సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఫ్యాషన్ , పాప్ కల్చర్‌కు సంబంధించిన ఇన్ స్టాగ్రామ్ పేజీ డైట్ సభ్యా అనే పేజీలో తాజాగా ఓ పోస్ట్ పెట్టారు. అందులో నెటిజన్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. దాంట్లో భాగంగా నటీ,నటుల గురించి చెబుతూ.. సెలబ్రిటీలు వేసుకునే బట్టలన్నీ అద్దెకు తెచ్చుకున్నవే అంటూ సమాధానం ఇచ్చారు. లేబుల్డ్, స్టమ్,అర్కైవల్ అనే పదాలు వాడినా అవన్నీ కూడా అద్దె కు తెచ్చుకున్న బట్టలే, ఈ వెంట్ అయిపోయాక, ఆ దుస్తులను డ్రై క్లీనిక్ చేసి మళ్లీ షాప్‌లో పెట్టేస్తారు. దీనికి సెలబ్రిటీల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోరు. జస్ట్ పాపులారిటీ, తమ డిజైన్ మార్కెట్‌లోకి వెళ్తుందని దీంతో తమ దుస్తులకు డిమాండ్ పెరుగుతుందని డీజైనర్స్, సెలెబ్రిటీలకు బట్టలు ఇవ్వడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇదో రకమైన బిజినెస్ అంటూ పోస్ట్‌లో తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.