కల్కి విజయం వెనుక ఉంది ఆ ఇద్దరు హీరోలేనా?వైరల్ అవుతోన్న న్యూస్!

డార్లింగ్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో అనతి కాలంలో పాన్ ఇండియా లెవల్‌కి ఎదిగిపోయాడు. డార్లింగ్, ఛత్రపతి, బిల్లా, వర్షం వంటి

Update: 2024-07-09 16:19 GMT

దిశ, సినిమా : డార్లింగ్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో అనతి కాలంలో పాన్ ఇండియా లెవల్‌కి ఎదిగిపోయాడు. డార్లింగ్, ఛత్రపతి, బిల్లా, వర్షం వంటి సినిమాలతో మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ హీరో బహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ప్రస్తుతం ఈ హీరో నటించిన కల్కి సినిమా రిలీజై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎంతో మంది స్టార్ హీరోస్ నటించారు. ముఖ్యంగా అమితాబచ్చన్. కమల్ హాసన్, విజయ్ దేవరకొండ, వంటి వారు నటించిన విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ కావడానికి కారణం మాత్రం ఆ ఇద్దరు స్టార్ హీరోలే అంటున్నారు కొందరు. ఇంతకు వారెవరు అనుకుంటున్నారా? జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్.

అయితే ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి మాట్లాడుతూ.. కల్కి సినిమా విజయం వెనుక పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు. వారందరి సపోర్ట్, వారిసాయం వల్లనే ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయ్యిందని తెలిపింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక పవన్ ఎన్నికల సమయంలో అందరు హీరోల అభిమానులు సపోర్ట్ చేయాలని కోరిన విషయం తెలిసిందే. దీంతో తారక్, ప్రభాస్, పవన్ ఫ్యాన్స్ ఏకమై జనసేకు ఎంతో సపోర్ట్ చేశారు. చివరకు జనసేన భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఈ క్రమంలోనే ప్రభాస్‌ సినిమాకు కూడా ముగ్గురు హీరోల ఫ్యాన్స్ ఒక్కటై సినిమాను సక్సెస్ చేశారని కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


Similar News