ఏమాత్రం ఇన్ఫర్మేషన్ లేకుండానే ఆ నటుడితో పెళ్లి పీటలు ఎక్కేసిన యంగ్ హీరోయిన్.. హల్దీ ఫొటోస్ వైరల్..

మలయాళీ బ్యూటీ అపర్ణా దాస్ పెళ్లి పీటలు ఎక్కబోతుంది. మంజుమ్మల్ బాయ్స్

Update: 2024-04-23 03:48 GMT

దిశ, సినిమా : మలయాళీ బ్యూటీ అపర్ణా దాస్ పెళ్లి పీటలు ఎక్కబోతుంది. మంజుమ్మల్ బాయ్స్ ఫేం దీపక్ పరంబోరల్ తో మూడు ముళ్లు వేయించుకోనుంది. ఏప్రిల్ 24న వీరి వివాహ మహోత్సవం జరగనుండగా.. ఇప్పటికే పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయి. హల్దీ వేడుకకు సంబంధించిన వీడియో రిలీజ్ కాగా డ్యాన్సులు చేస్తూ ఒకరిపై మరొకరు నీళ్లు చల్లుకుంటూ ఆనందంగా కనిపించారు.

కాగా ఈ వీడియో చూసిన అపర్ణా ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు. అప్పుడే నీకు పెళ్లి అయిపోతుందా.. ఇంత తొందరెందుకు డియర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా కంగ్రాట్స్ డియర్.. హ్యాపీ మ్యారీడ్ లైఫ్అంటూ శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇక అపర్ణ బీస్ట్, అదికేశవ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.



Similar News