థ్రిల్లర్ మూవీతో రాబోతున్న అనన్య పాండే.. ఇంట్రెస్టింగ్‌గా CTRL Trailer

ఈ మధ్యకాలంలో ఓటీటీలో ఎక్కువగా క్రైమ్, థ్రిల్లర్ మూవీస్ వస్తున్నాయి.

Update: 2024-09-25 13:42 GMT

Full View

దిశ, సినిమా: ఈ మధ్యకాలంలో ఓటీటీలో ఎక్కువగా క్రైమ్, థ్రిల్లర్ మూవీస్ వస్తున్నాయి. ప్రేక్షకులు కూడా అలాంటి సినిమాలపైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక మేకర్స్ కూడా ప్రజెంట్ ట్రెండ్‌కి కనెక్ట్ అయ్యే కాన్సెప్టుతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. ఈ మధ్య కాలంలో అలాంటి కథలతో వచ్చిన ప్రతి సినిమా దాదాపుగా హిట్ అయింది. ప్రజెంట్ అలాంటి క్రైమ్ థ్రిల్లర్ చిత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయింది. అనన్య పాండే, విహాన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన నెట్‌ఫ్లిక్స్ మూవీ ‘CTRL’. విక్రమాదిత్య మొత్వానే దర్శకత్వం వహించిన ఈ సైబర్ థ్రిల్లర్ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు చిత్ర బృందం.

ఇందులో ‘అనన్య పాండే ‘CTRL’ అనే ఒక యాప్ డౌన్‌లోడ్ చేసి అందులో ప్రొఫైల్ క్రియేట్ చేస్తుంది. అలాగే తన జీవితం మీద కంట్రోల్‌ని ఆ యాప్‌కి ఇస్తుంది. అందులో విహాన్‌తో ఆమె లవ్ జర్నీ మొత్తం రిప్రజెంట్ అవుతుంది. మెల్లగా అనన్య పాండే జీవితం నుంచి విహాన్, అతని జ్ఞాపకాలని యాప్ ద్వారా చెరిపేస్తుంది. తర్వాత సడెన్‌గా విహాన్ కనిపించడం లేదని అనన్యకి మరో ఫ్రెండ్ వీడియో కాల్‌లో చెబుతుంది. అక్కడి నుంచి కథని ఇంటరెస్టింగ్‌గా నడుస్తోంది. అసలు విహాన్ ఏమయ్యాడు.. ‘CTRL’ యాప్‌కి విహాన్ మిస్సింగ్‌కి ఏమైనా సంబంధం ఉందా అనేది ట్విస్ట్. కాగా.. ఈ డిజిటల్ మూవీ అక్టోబర్ 4న రిలీజ్ కాబోతోంది.


Read More...

మనిషి పుట్టడంతోనే జీవితం అనే శ‌త్రువును వెంటేసుకుని పుడ‌తాడు.. ఆసక్తికరంగా ‘కలి’ ట్రైలర్ 


Similar News