సూర్య నెక్ట్స్ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్..

స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’.

Update: 2024-09-25 14:36 GMT

దిశ, సినిమా: స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో దిశ పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని హ్యూజ్ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబర్ 14న గ్లోబల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అయితే.. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే సూర్య ఇప్పటికే మరో చిత్రాన్ని అనౌన్స్ చేశాడు.

ఇది సుబ్బరాజు దర్శకత్వంలో వస్తుండగా.. ఇందులో పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు సూర్య 45వ చిత్రం గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ స్టార్ హీరో తన 45వ సినిమాను చేస్తున్నాడట. దీనికి RJ బాలాజీ దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది. అయితే.. ఈ కథను RJ బాలాజీ ఇంతకు ముందే T69 కోసం దళపతి విజయ్‌కి చెప్పాడట. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఇదే స్టోరీ సూర్యతో తెరకెక్కిస్తున్నాడట సూర్య. అయితే.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. 


Read More...

Hero Surya: హీరో సూర్య పేరుతో పవన్ కు క్షమాపణలు.. అందర్ని కన్ఫ్యూజ్ చేస్తున్న ఆ ట్వీట్? 


Similar News