Ananya Nagalla: ఆ పార్ట్‌పై టాటూకు అర్థం చెప్పిన కుర్ర హీరోయిన్.. ఫోకసంతా ఒకవైపేనంటూ!

‘మల్లేశం’ చిత్రంతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది కుర్ర హీరోయిన్ ‘అనన్య నాగళ్ల’.

Update: 2024-07-20 09:29 GMT

దిశ, సినిమా: ‘మల్లేశం’ చిత్రంతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది కుర్ర హీరోయిన్ ‘అనన్య నాగళ్ల’. తర్వాత పవన్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాలో అవకాశం కొట్టేసి అటు సినీ ఇండస్ట్రీలో, ఇటు తెలుగు ప్రేక్షకుల్లో ఫేమ్ దక్కించుకుంది. అంతేకాకుండా టాలీవుడ్ బ్యూటీఫుల్ అండ్ అగ్ర హీరోయిన్ సమంత కీలక పాత్ర పోషించిన ‘శాకుంతలం’ మూవీలో నటించి ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. సపోర్ట్ రోల్స్‌లో నటిస్తూ.. ఈ ముద్దుగుమ్మ అతితక్కువ సమయంలోనే హీరోయిన‌్‌గా చాన్స్‌లు సంపాదించుకుంది. శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ సినిమా ‘తంత్ర’ లో అనన్య.. ధనుష్ రఘుముద్రి సరసన ప్రధాన పాత్రలో నటించింది.

అయితే అనన్య తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఇందులో యాంకర్ వకీల్ సాబ్‌ చిత్రంలోని తన క్యారెక్టర్ గురించి అడగ్గా చాలా చక్కగా సమాధానం చెప్పుకొచ్చింది. అలాగే తన చేతిపై ఉన్న టాటుకు మీనింగ్ ఏంటని ప్రశ్నించగా.. ‘ఐ బిలీవ్ ఇన్ సెల్ఫ్’ అనగా నన్ను నేను నమ్ముతాను. మన ముఖంపై ఉన్న చిరునవ్వును ఎప్పటికీ మర్చిపోవచ్చు. ప్రతి ఒక్కరూ తమ గోల్స్ పై ఫోకస్ పెట్టి సంతోషాన్ని, ఇతరులతో సరదగా గడపటం మర్చిపోతారు. నేను కూడా అంతే. నా ఫోకస్ అంతా ఒకదానిపైనే పెడతాను. అందుకే చేతిపై ఇలా టాటూ వేసుకున్నానని’ బ్యూటీ అనన్య పేర్కొంది.

ఇక ఈ అమ్మడు గతంలో తనకు ఇంతవరకు ఎవరూ ప్రపోజ్ చేయలేదని, ఎవరైనా సరే చిత్ర పరిశ్రమలో ఉండేవారు అల్రెడీ కమిట్ అయ్యే ఉంటారని ఫిక్స్ అయిపోతారని వెల్లడించిన విషయం తెలిసిందే. అలాగే తను ఇంతవరకు కాస్టింగ్ కౌచ్ కూడా ఎదుర్కొలేదని అనన్య చెప్పుకొచ్చింది.


Similar News