Amitabh Bachchan : ఆమె అంటేనే భయపడిపోతున్న అమితాబ్ బచ్చన్.. ఎందుకంటే..
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్.. భార్య జయా బచ్చన్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
దిశ, సినిమా: బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్.. భార్య జయా బచ్చన్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. బిగ్ బి హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ టాక్ షోకు సంబంధించిన తాజా ఎపిసోడ్‌లో ఓ మహిళ పాల్గొనగా.. మీరు టీచర్ అయితే ఎలా ఉంటారు? స్ట్రిక్ట్‌గానా లేక సరదాగానా? అని ప్రశ్నించాడు. దాకిని ఆమె.. ‘సార్, నేను టీచింగ్ చేసేటప్పుడు కఠినంగానే వ్యవహరిస్తాను. మిగతా సమయాల్లో సాధారణంగా కూల్‌గానే ఉంటా’ అని సమాధానం ఇచ్చింది.
ఇక వెంటనే ఆమె బిగ్ బిని జయా బచ్చన్ గురించి ప్రశ్నించింది. దీనికి సమాధానమిస్తూ.. ‘ఆమె నా పట్ల చాలా స్ట్రిక్ట్‌గానే ఉంటుంది .అయినా ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడుగుతారు. ఆమె ఈ షో చూసిందంటే నా పని అంతే. ఆ సీన్ తలచుకుంటుంటేనే నాకు భయంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు. దీన్నిబట్టి చూస్తే ఎంత రాజైనా భార్య ముందు పిల్లి అనే సమేత గుర్తొస్తుంది అంటున్నారు నెటిజన్లు.