‘యానిమల్’ మూవీకి అల్లు అర్జున్ రివ్యూ.. రష్మిక నటన గురించి ఏమన్నారంటే..?

డైరెక్టర్ సందీప్ వంగా రెడ్డి తెరకెక్కించిన తాజా సినిమా ‘యానిమల్’.

Update: 2023-12-08 09:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: డైరెక్టర్ సందీప్ వంగా రెడ్డి తెరకెక్కించిన తాజా సినిమా ‘యానిమల్’. రణబీర్ కపూర్, రష్మిక కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘యానిమల్’ మూవీ టీంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ సినిమాపై తన రివ్యూ ఇచ్చాడు. ఈ మేరకు ‘‘యానిమల్’ మూవీ జస్ట్ బ్లాక్ బస్టర్. రణబీర్ కపూర్ ఇండియన్ సినిమా ఎక్స్‌పీరియన్స్‌ను వేరే లెవల్‌కు తీసుకెళ్లాడు. ఇక రష్మిక చాలా బ్రిలియంట్‌గా నటించావు. ఇప్పటి వరకు చేసిన వాటిలో ఇది బెస్ట్ యాక్టింగ్. ఇంకా ఇలాంటివి మరెన్నో చేయబోతున్నావని తెలుస్తోంది. బాబీ డియోల్ మీ పెర్ఫార్మెన్స్ మమ్మల్ని ఎంతగానో అలరించింది’ అంటూ చెప్పుకొచ్చారు.

ఇక వారితో పాటు మిగతా అందరు నటీనటుల, టెక్నీషియన్లు కూడా సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లారు అంటూ మూవీ టీం మొత్తానికి కాంగ్రాట్స్ తెలిపారు. ఇక ఫైనల్‌గా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి చెప్తూ.. ‘మీరు మరోసారి మా అందరినీ గర్వపడేలా చేశారు. మీ సినిమాలు ఇప్పుడు, భవిష్యత్తులో భారతీయ సినిమా ముఖ చిత్రాన్ని ఎలా మార్చబోతున్నాయో నేను స్పష్టంగా చూడగలగాను’ అంటూ ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారుతోంది.   


Similar News