అంబానీ ఇంట్లో జరిగేది పెళ్లి కాదు సర్కాస్.. ఆలియా షాకింగ్ కామెంట్స్!
ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లిని అంగరంగ వైభవంగా ముంబైలో చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకలు చాలా ఘనంగా చేశారు. ఇక హాల్దీ, మెహందీ ఫంక్షన్స్ కూడా హై రేంజ్లో చేస్తున్నారు.
దిశ, సినిమా : ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లిని అంగరంగ వైభవంగా ముంబైలో చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకలు చాలా ఘనంగా చేశారు. ఇక హాల్దీ, మెహందీ ఫంక్షన్స్ కూడా హై రేంజ్లో చేస్తున్నారు. ఈ వేడుకలకు బాలీవుడ్ నుంచి ఎంతో మంది సినీ తారలు అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. కాగా, ఈ పెళ్లి వేడుకలపై బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఆమె తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. అంబానీ ఇంట్లో జరిగేది పెళ్లిలా లేదు, అది ఓ సర్కస్ లా ఉంది, నేను కూడా ఆ సర్కస్‌ను ఫాలో అవుతున్నాను, నన్ను కూడా పెళ్లికి ఆహ్వానించారు కానీ డబ్బు కోసం పెళ్లికి వెళ్లాలి అనుకోవడం లేదు, వాళ్లు ఇచ్చే డబ్బు కంటే ఆత్మగౌరవం గొప్పదని భావిస్తున్నాను అంటూ తెలిపింది. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.