Devara: దేవర చిత్రంలో అలియా నటించిందా? క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ

భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న దేవర చిత్రం సెప్టెంబరు 27 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

Update: 2024-09-14 02:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న దేవర చిత్రం సెప్టెంబరు 27 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెలిస్ లో జరిగే అతిపెద్ద జానర్ ఫిల్మ్ ఫెస్టివల్ బియాండ్ ఫెస్ట్‌లో సెప్టెంబరు 26 వ తేదీన ఈజిప్షియన్ థియేటర్‌లో ప్రదర్శించనున్నారు. హాలీవుడ్‌లో ఒక్క రోజు ముందే దేవర రిలీజ్ అవుతుండటంతో తారక్ ఫ్యాన్స్ ఎగిరిగంతులేస్తున్నారు.

ప్రస్తుతం దేవర సినిమాపై చిత్ర బృందం హైప్ పెంచే పనిలో పడిపోయారు. ఈ క్రమంలో దేవర నుంచి సాంగ్స్, ట్రైలర్, పోస్టర్లు విడుదల చేస్తూ జనాల్లో క్యూరియాసిటీని పెంచుతున్నారు. మరో రెండు వారాల్లో విడుదలవ్వబోతున్న ఈ చిత్ర ట్రైలర్ ఈవెంట్ ముంబయిలో గ్రాండ్‌గా చేశారు. అక్కడ ఎన్టీఆర్ ప్రమోషన్ ఇంటర్వ్యూలు కూడా చేశాడు. ఈ ఇంటర్వ్యూలో బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ తో తారక్ స్పెషల్ ఇంటర్వ్యూ చేశాడు.

అయితే గతంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు అలియా ఇంటర్వ్యూలో కనిపించడంతో జనాల్లో అలియా కూడా దేవర చిత్రంలో నటిస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఈ బాలీవుడ్ బ్యూటీ దేవరలో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చిందని, చిన్న పాత్రలో మెరవనుందని బాలీవుడ్ సినీ వర్గంలో టాక్ వినిపించింది.

తాజాగా ఈ వార్తలపై అలియా భట్ స్పందించి.. నెటిజన్లకు క్లారిటీ ఇచ్చింది. దేవర సినిమాలో నటించట్లేదని తెలిపింది. జస్ట్ ప్రమోషన్స్ కోసం తారక్‌ను మీట్ అయ్యానని వెల్లడించింది. ఇక అలియా జిగ్రా చిత్రంలో నటిస్తుంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.


Similar News