సమంతను ఘోరంగా అవమానించిన అక్కినేని కుటుంబం..? అలా చేయడంతో బయటపడ్డ సంచలన నిజాలు

‘ఏమాయ చేశావే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సమంత అందరికీ సుపరిచితమే.

Update: 2024-07-11 03:49 GMT

దిశ, సినిమా: ‘ఏమాయ చేశావే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సమంత అందరికీ సుపరిచితమే. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ బ్యూటీ. అయితే సమంత తన మొదటి సినిమాతోనే యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సమంతకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. దీంతో వరుసగా సినిమాలు చేసుకుంటూ ఫుల్ బిజీ బిజీగా మారిపోయింది. ఇక ఈ సినిమా టైంలోనే అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడింది ఈ అమ్మడు.

దాదాపు 7 ఇయర్స్ ప్రేమించుకున్న వారు.. ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి ఘనంగా పెళ్లి కూడా చేసుకున్నారు. 4 ఇయర్స్ పాటు తమ మ్యారీడ్ లైఫ్‌ని ఎంజాయ్ చేశారు. ఇక ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత సమంత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో నటించింది. నాగచైతన్య కూడా వివాహ అనంతరం సినిమాల్లో బిజీగా ఉండేవాడు. ఇక ఏమైందో తెలియదు కానీ ఇద్దరూ కొన్ని అనివార్య కారణాలతో విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం ఎవరికివారు బిజీగా ఉండిపోయారు. ఈ క్రమంలోనే ఇటు సమంతకు, ఆటు నాగచైతన్యకు సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. కానీ వాటిపై వీరిద్దరూ ఎప్పుడు మాట్లాడలేదు. ఏది ఏమైనా ఎప్పటికైనా వీరిద్దరూ కలుస్తారని ఆశ ఇన్ని రోజులు ప్రతి ఒక్కరిలో ఉండేది.

అలాగే అక్కినేని కుటుంబంలో కూడా వీరు కలుస్తారని ఏదో ఒక చిన్న ఆశ ఉండేదట. ఆ ఆశతోనే సమంతకు సంబంధించిన కొన్ని జ్ఞాపకాలు వారి ఇంట్లో అలానే దాచుకున్నారట. ఇక ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత వీరిద్దరూ కలవరని తెలుసుకొని అక్కినేని ఇంట్లో సమంతకు సంబంధించిన కొన్ని ఫోటోలను వారి స్టోర్ రూమ్ నుంచి తీసేశారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కానీ వీరు కలిస్తే బాగుంటుందని.. సమంత, నాగచైతన్య అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి వీరు కలవరని అంతా ఫిక్స్ అయిపోయారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హల్ చల్ చేస్తుంది.


Similar News