రాత్రికి అది లేకుండా ఉండలేనంటున్న మన్మథుడు.. రోజూ రెండు రౌండ్లు వేయనిదే..

ళ్లల్లో చురుకుదనం, ముఖంపై ముసి ముసి నవ్వులు.. చూడగానే ఆకట్టుకునే రూపం అతనిది. ప్రశాంత మూర్తిలా కనిపిస్తున్న అతను, రాత్రికి మాత్రం అది లేకుండా అస్సలు ఉండలేనంటున్నాడు.

Update: 2024-06-05 13:50 GMT

దిశ, సినిమా : కళ్లల్లో చురుకుదనం, ముఖంపై ముసి ముసి నవ్వులు.. చూడగానే ఆకట్టుకునే రూపం అతనిది. ప్రశాంత మూర్తిలా కనిపిస్తున్న అతను, రాత్రికి మాత్రం అది లేకుండా అస్సలు ఉండలేనంటున్నాడు. రోజూ రెండు రౌండ్లు వేస్తేగానీ నిద్ర పట్టదట. పైగా తన ఫిట్‌నెస్ అసలు రహస్యం కూడా అదేనంటున్నాడు ఈ మన్మథుడు. ఇంతకీ ఎవరతను అనుకుంటున్నారా? మోస్ట్ ఫేమస్ హీరో అక్కనేని నాగార్జున. అతను నటించిన సినిమాల్లో ‘మన్మథుడు’, ‘కింగ్’ మూవీస్ కూడా ఒకటి కావడంతో అభిమానులు ముద్దుగా మన్మథుడు, కింగ్ అనే నిక్‌నేమ్‌లతో పిలుస్తుంటారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగార్జున అంటేనే ఫిట్‌నెస్‌కు కేరాఫ్‌ అనే టాక్ ఉంది. ఎందుకంటే ఆరు పదుల వయస్సులోనూ ముప్పై ఏండ్ల కుర్రాడిలా కనిపిస్తుంటాడు నాగ్. ఇలా కనిపించడానికి అతను ఫుడ్ అండ్ డైట్ విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు కావచ్చునని చాలా మంది అనుకుంటారు. కానీ అసలు విషయం తెలిస్తే మాత్రం షాక్ అవుతారు. ఎందుకంటే బాడీ ఫిట్‌నెస్ నాగార్జున పెద్దగా కష్టపడట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ్ తన ఫిట్‌నెస్ రహస్యాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా రాత్రికి అది లేకుండా ఉండలేనంటూ, రోజూ రెండు రౌండ్లు వేయకుండా నిద్రపట్టదని తాను ఆల్కహాల్ తీసుకునే విషయమై పరోక్షంగా, సెటైరికల్‌గా చెప్పుకొచ్చాడు.

‘నా సామి రంగ’ మూవీ ప్రమోషన్ సమయంలోనూ కీరవాణి, చంద్రబోస్‌లతో చిట్ చాట్ సందర్భంగా నాగార్జున ఈ విషయాలను పంచుకున్నాడు. ఫిట్‌నెస్ కోసం తాను పెద్దగా ఏమీ కష్టపడనని అందరిలా రెండు మూడు రకాల కూరగాయలు, నాన్ వెజ్‌లో.. మటన్, చికెన్, ఫిష్.. ఇలా అన్నీ కడుపునిండా తింటానని తెలిపాడు. కాగా సాయంత్రం ఎర్లీగా.. అంటే ఏడు గంటలలోపే తాను తినాల్సింది తినేస్తాడట. ఆ సమయంలో వైట్ రైస్‌కి బదులు బ్రౌన్ రైస్ తింటానని, దీంతోపాటు రోజూ రెండు రౌండ్లు మందేస్తానని, రాత్రికి కచ్చితంగా ఒక్క ముక్క స్వీట్ అయినా తింటానని వెల్లడించారు నాగార్జున. ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఇలా అన్నీ తినేస్తూ.. ప్రత్యేక డైట్ పాటించకుండానే అంత ఫిట్‌గా ఎలా ఉంటున్నాడబ్బా అని పలువురు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. 


Similar News