ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ విడాకులు..? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్-అభిషేక్ బచ్చన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఆరాధ్య అనే కూతురు కూడా ఉంది.

Update: 2024-09-02 09:23 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్-అభిషేక్ బచ్చన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఆరాధ్య అనే కూతురు కూడా ఉంది. అయితే గత కొద్ది రోజుల నుంచి ఐశ్వర్య, అభిషేక్ విడాకులు తీసుకుని విడిపోయారంటూ సోషల్ మీడియాలో పలు పుకార్లు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బిగ్‌బీ ఇంటి నుంచి ఆమె తన కూతురిని తీసుకుని వెళ్లిపోయిందనే రూమర్స్ ఎక్కువయ్యాయి. మరీ ముఖ్యంగా ఇటీవల జరిగిన అనంత్ అంబానీ పెళ్లికి ఐశ్వర్య, అభిషేక్ వేర్వేరుగా వెళ్లడంతో విడాకుల వార్తలకు బలం చేకూరినట్లైంది.

కానీ ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ వీరిద్దరు మాత్రం అధికారికంగా విడాకుల గురించి స్పందించి లేదు. దీంతో వీరిద్దరి విడాకులకు సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్‌కు సంబంధించిన వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. కూతురిలో వీరిద్దరు దుబాయ్ వెకేషన్‌కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చి బస్సు ఎక్కుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రజెంట్ వైరల్ కావడంతో అంతా క్యూట్ అని కామెంట్లు పెడుతున్నారు. ఈ ఒక్క వీడియోతో విడాకుల రూమర్లకు కూడా చెక్ పడినట్లు అయింది.


Similar News