Nayanthara: 7 నెలల తర్వాత ఓటీటీలోకి నయనతార కాంట్రవర్సీ మూవీ.. కానీ ట్విస్ట్ ఏంటంటే?

స్టార్ హీరోయిన్ నయనతార నటించిన చిత్రం ‘అన్నపూరణి’.

Update: 2024-08-07 10:34 GMT

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ నయనతార నటించిన చిత్రం ‘అన్నపూరణి’. 75వ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ 1న థియేటర్స్‌లో విడుదలైంది. కానీ పెద్దగా ప్రేక్షకులను మెప్పించకపోవడంతో అదే నెల చివర్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఇందులో ఆమె బ్రాహ్మణ అమ్మాయిలా నటించిన విషయం తెలిసిందే. కానీ నాన్ వెజ్ వంటలు చేయడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అంతేకాకుండా సినిమా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని నెట్‌ప్లిక్స్ నుంచి తొలగించేశారు.

అలాగే నయనతార తన వల్ల బాధ పడిన వారికి క్షమాపణలు కూడా తెలిపింది. అంతటితో వివాదానికి చెక్ పడినట్లు అయింది. ఇదిలా ఉంటే.. తాజాగా.. మరోసారి అన్నపూరణి ఓటీటీలోకి రాబోతుందని అధికారిక ప్రకటన విడుదలైంది. సింప్లీ సౌత్ అనే ఓటీటీ సంస్థలో ఆగస్టు 9 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులో రానున్నట్లు ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. విడుదల 7 నెలల తర్వాత వరల్డ్ వైడ్‌గా స్ట్రీమింగ్ అవుతుంది. కానీ ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. ఇండియాలో మాత్రం స్ట్రీమింగ్ కాదని తెలిపారు. దీంతో నయన్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.

Tags:    

Similar News