‘ఇవాళ శుభవార్త విన్నాను’.. రేవ్ పార్టీ ఇష్యూపై నటి హేమ కామెంట్స్

సినీ నటి హేమపై బెంగళూరు రేవ్ పార్టీ ఇష్యూలో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

Update: 2024-09-13 02:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: సినీ నటి హేమపై బెంగళూరు రేవ్ పార్టీ ఇష్యూలో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇష్యూపై హేమ తాజాగా ఓ వీడియో విడుదల చేసింది. వీడియోలో హేమ మాట్లాడుతూ.. ఇవాళ నేను శుభవార్త విన్నానని తెలిపింది. మా లాయర్ కాల్ చేసి బ్లడ్ రిపోర్ట్స్ అన్ని నెగిటివ్ వచ్చాయని చెప్పాడని వెల్లడించింది. ఆల్రెడీ తనకు నెగిటివ్ వస్తోందని తెలుసునని, ఇప్పుడు అధికారికంగా కూడా వెల్లడైందని చెప్పింది. ఈ సంతోషకరమైన వార్త మీ అందరితో పంచుకుంటున్నాను’ అంటూ హేమ వీడియోలో చెప్పుకొచ్చింది. ఇక గతంలో కూడా హేమ నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. నాకు బెంగళూరు రేవ్ పార్టీతో సంబంధం లేదు. అనవసరంగా నన్ను లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. డ్రగ్స్ సప్లయర్స్ తో హేమకు గల సంబంధాలపై బెంగళూరు పోలీసులు ఆరా తీశారు. నటి హేమ బెంగళూరు పోలీసులకు తన పేరు, మొబైల్ నెంబర్ తప్పుగా చెప్పింది. కస్టడీ అనంతరం హేమకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. ఇప్పటికే హేమను మా అసోసియేషన్ నుంచి తొలగించారు. 


Similar News