‘కన్నప్ప’ నుంచి నటి ఐశ్వర్య లుక్ రిలీజ్.. హైప్ పెంచేస్తున్న న్యూ పోస్టర్

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి వరుస అప్‌డేట్స్ వస్తూనే ఉన్నాయి.

Update: 2024-09-23 15:04 GMT

దిశ, సినిమా: విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి వరుస అప్‌డేట్స్ వస్తూనే ఉన్నాయి. అందులో వర్క్ చేస్తున్న ప్రతి క్యారెక్టర్‌కు సంబంధించి నటీనటుల లుక్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై మరింత హైప్ పెంచేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా, అక్షయ్ కుమార్ పాత్రలకు సంబంధించి లుక్‌ను విడుదల చేశారు. అంతే కాకుండా గత వారం కన్నప్ప నుంచి విధేయుడు, స్నేహితుడు అంటూ తిన్నడు ఉపయోగించే గుర్రం ‘టిక్కి’ లుక్‌ను రిలీజ్ చేశారు.

ఇక ఈ సోమవారం మారెమ్మ పాత్రకు సంబంధించిన లుక్‌ను రిలీజ్ చేశారు. నటి ఐశ్వర్య ఈ మారెమ్మ లుక్‌లో అందరినీ భయపెట్టేలా ఉన్నారు. ఆమెకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘అడివిని పీడించే అరాచకం మారెమ్మ.. కుతంత్రమే ఆమె మంత్రం’ అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. కాగా.. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. డిసెంబర్‌లో ఈ సినిమా పాన్‌ ఇండియా వైడ్‌గా విడుదల కానుంది.


Similar News