మూడో పెళ్లిపై అమీర్ ఖాన్ రియాక్షన్.. తోడు లేకుండా ఉండలేనంటూ షాకింగ్ కామెంట్స్!
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ గత కొద్ది కాలంగా సినిమాలు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ప్రజెంట్ సితారే జమీన్ మూవీ చేస్తున్నాడు.
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ గత కొద్ది కాలంగా సినిమాలు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ప్రజెంట్ సితారే జమీన్ మూవీ చేస్తున్నాడు. ఇక ఆయన పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. రీనా దత్తాను పెళ్లి చేసుకున్న అమీర్ 16 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుని విడిపోయాడు. ఆ తర్వాత దర్శకురాలు కిరణ్ రావును పెళ్లి చేసుకున్నాడు. ఇక ఆమెతో కూడా ఏవో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయాడు. ఈ క్రమంలో.. అమీర్ మూడో పెళ్లి చేసుకోబోతున్నారంటూ పలు వార్తలు కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే. కానీ అవన్నీ పుకార్లే అని తేలింది. ఈ నేపథ్యంలో.. తాజాగా, అమీర్ ఖాన్, రియా చక్రవర్తి చేసిన ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో భాగంగా మూడో పెళ్లి గురించి రియాక్ట్ అయ్యాడు.
మళ్లీ చేసుకునే ఉద్దేశం ఉందా అని అడగ్గా.. ‘‘ ప్రజెంట్ నా ఏజ్ 59 ఏళ్లు. ఈ సమయంలో మళ్లీ పెళ్లి చేసుకోవడం కష్టం. అలా అని ఒంటరిగా ఉండటం అస్సలు నచ్చదు. ఒక తోడు కావాలి. అయితే విడాకులు తీసుకున్నప్పటికీ నా మాజీ భార్యలిద్దరు నాతో క్లోజ్‌గానే ఉంటున్నారు. మేమంతా ఒకే కుటుంబంలా కలిసి ఉంటాం. అందరితో సంతోషంగా గడుపుతున్నా. ఎన్నో బాధ్యతలు నాపై ఉన్నాయి. ప్రస్తుతం నన్ను నేను మార్చుకోవడానికి ట్రై చేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత రియా పెళ్లి గురించి మీ అభిమానులకు ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటున్నారా అని అడగ్గా.. నా రెండు పెళ్లిళ్లు విఫలం అయ్యాయి. అలాంటి నన్ను వివాహం గురించి సలహాలు అడగకండి’’ అని చెప్పాడు. ప్రజెంట్ అమీర్ ఖాన్ ఇంటర్వ్యూ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.