మనుషుల్ని ముక్కలుగా నరికి వండుకుని తినే అడవి జాతి.. OTT లో మోస్ట్ డిస్ట్రబింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
ఈ మధ్య కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. థియేటర్లలో విడుదలైన 20 నుంచి 25 రోజుల లోపే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి జనాలు కూడా థియేటర్స్‌కి వెళ్లి మూవీ చూడటానికి అంత ఇష్టపడట్లేదు. అయితే వీటిలో ఉండే మూవీస్ కూడా వివిధ జోనర్లలో ఉంటాయి. అందులో సస్పెన్స్, హారర్, ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్, సోషల్ ఇన్స్పైర్, మోస్ట్ డిస్ట్రబెన్స్, రొమాంటిక్ మూవీ అంటూ పలు రకాల జోనర్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు చెప్పబోయో మూవీ మోస్ట్ డిస్టబెన్స్ జోనర్‌కు సంబంధించినది. మరి ఈ మూవీ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను ఇప్పుడు చూసేయండి.
ఈ మూవీ కథ విషయానికి వస్తే..
అమెజాన్ అడవుల్లో రెండ్ హంటర్స్ అనే ఒక తెగకు చెందిన ప్రజలు నివసిస్తూ ఉంటారు. అక్కడ ఓ పెద్దాయన తన మనుమరాలికి ఫుడ్ ఎలా సేకరించాలి అనేది చెప్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే కొంతమంది గ్రీన్ డ్రెస్ వేసుకుని.. చెట్లను నరుకుతూ ఉంటారు. ఇది చూసిన ఆ ముసలాయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడితో మరొక సీన్ స్టార్ట్ అవుతుంది. అమెరికాలోని ఓ యూనివర్సిటీలో లెక్చరర్ తన స్టూడెంట్స్‌కు దేశంలోని రకరకాల ప్రాబ్లమ్స్ గురించి చెబుతూ.. వాటిలో కొన్ని తెగల్లో ఉండే ఆడవారు తమ హక్కులను పొందాలంటే కొన్ని భయంకరమైన టెస్టులు చేస్తుంటారు అని చెప్తుంది. ఆ హక్కులు తెలుసుకున్న ఆ స్టూడెంట్స్ షాక్ అవుతారు. అయితే ఆ స్టూడెంట్స్‌లోనే ఓ లాయర్ కూతురు ఉంటుంది. ఆమె ఎలాగైనా ఈ వింత ఆచారాన్ని ఆపాలని అనుకుని వాళ్ల ఫ్రెండ్స్‌కు చెప్తుంది. అలా ఆ స్టూడెంట్స్ అంతా కలిసి ఓసారి అమెజాన్ అడవుల్లో జరిగే ఆ అరాచకాన్ని ఆపడానికి కెమెరాలతో సహా .. ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని.. అమెజాన్ అడవుల్లోకి వెళ్తారు. అయితే అనుకోకుండా ఆ లాయర్ కూతురు జస్టిన్ ప్రాబ్లమ్‌లో చిక్కుకుంటుంది. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని తిరిగి వెళ్లిపోతుండగా వాళ్ళ ఫ్లైట్ క్రాష్ అయ్యి అడవి మధ్యలో పడిపోతుంది.
దీంతో వచ్చిన వారిలో సగం మంది చనిపోతారు. ఇప్పుడే అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఉన్నది రెడ్ హంటర్స్ ఉండే ప్లేస్‌లో. రెండ్ హంటర్స్ అంతా కూడా వీళ్ళను శత్రువులుగా భావించి.. ఆ స్టూడెంట్స్‌ను ఒక్కొక్కరిని ముక్కలు ముక్కలుగా నరికి వండుకుని మరి తింటూ ఉంటారు. దీనిని మిగిలిన స్టూడెంట్స్ చూసి కనీసం వారైన తప్పించుకోవాలి అనుకుంటారు. కానీ అక్కడే ఉన్న కాపలా వాళ్లకు దొరికిపోతారు. అసలు ఆ రెడ్ హంటర్స్ ఎవరు ? ఎందుకు మనుషుల్ని చంపి తింటున్నారు? ఆ స్టూడెంట్స్ అక్కడి నుంచి తప్పించుకుంటారా లేదా ? చివరికి ఏమైంది ? అనే విషయాలు తెలియాలంటే.. 'ది గ్రీన్ ఇన్ఫెర్నో' అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో రెంటల్ బేసిస్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే యూట్యూబ్‌లో కూడా ఉంది. కాబట్టి ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి.