53వ పుట్టిన రోజున ఫ్యాన్స్‌కు న్యూడ్ బాడీ గిఫ్ట్ ఇచ్చిన జెన్నిఫర్ లోపెజ్
తన శరీరానికి లోషన్‌ను అప్లై చేస్తూ ఉంటుంది. Sharing a glimpse of her latest nude photoshoot.
దిశ, వెబ్‌డెస్క్ః జెన్నిఫర్ లోపెజ్ పేరు వింటేనే ఆమె అభిమానులకు ఒళ్లు వేడుక్కెతుంది. తన పాటలు ఎంత ఉత్తేజాన్ని నింపుతాయో, తనలో ఉన్న ప్రతి కళా రూపం అంతే ఆకర్షణీయంగా అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా, ఐదు పదులు దాటిన వయసులో కూడా ఆమె వయ్యారాలు మాయ చేసేస్తుంటాయంటే నమ్మక తప్పదు. ఇలాంటి గాయని-నటి జెన్నీ తన తాజా న్యూడ్ ఫోటోషూట్ గ్లింప్స్‌ను అభిమానులతో పంచుకుంది. జూలై 24న తన 53వ పుట్టినరోజు సందర్భంగా జెన్నిఫర్ తన అభిమానులకు ఈ మెస్మరైజింగ్ గిఫ్ట్‌ను అందించింది. ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో దీనికి సంబంధించిన ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో జెన్నిఫర్ లోపెజ్ నగ్నంగా ఉటుంది. మరో షాట్లో నల్లటి స్విమ్మింగ్ సూట్ ధరించి, తన శరీరానికి లోషన్‌ను అప్లై చేస్తూ ఉంటుంది. జెన్నీ నవ్వుతో వీడియో ముగుస్తుంది.
స్కిన్‌కేర్, బ్యూటీ శ్రేణి JLo బ్యూటీ నుండి కొత్త స్కిన్ కేర్ ప్రొడక్ట్‌ను ప్రారంభించిన సందర్భంగా ఈ వీడియోను విడుదల చేశారు. బ్రాండ్ ఇన్స్టాగ్రామ్ పేజీ కొత్త ప్రొడక్ట్ గ్లింప్స్ ఇస్తూ జెన్నిఫర్ నగ్న చిత్రాలను కూడా పంచుకుంది. ఇక, 53 ఏళ్ళ వయసులో ఆమె టోన్డ్ బాడీ గురించి ఆమె అభిమానులు ఎంతగా ప్రస్తుతించి ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. "ప్రపంచంలోని అత్యంత అందమైన, సెక్సీ మహిళ పరిపూర్ణత" అని ఒక అభిమాని రాయగా, "53 ఏళ్లు అలా కనిపిస్తున్నాయి. హెచ్‌బిడి దివా" అని మరో అభిమాని విష్ చేశాడు. "యాస్ క్వీన్!! హ్యాపీ బర్త్ డే మై స్వీట్ హార్ట్" అంటూ ఓ అభిమాని విష్ చేశాడు.