హైదరాబాద్‌కు ఆ గుణం ఉంది : కేసీఆర్

దిశ, తెలంగాణ బ్యూరో: అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో హైదరాబాద్ నగర శివారులో సుమారు రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో సినిమా సిటీ నిర్మాణం కానుందని సీఎం పేర్కొన్నారు. సినీరంగానికి చెందిన ప్రముఖులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో శనివారం సమావేశమైన సందర్భంగా పై ప్రకటన చేశారు. సినీ ప్రముఖులు, అధికారుల బృందం బల్గేరియా వెళ్ళి అక్కడి సినిమా సిటీని పరిశీలించి రావాలని, ‘సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్’ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని సంబంధిత అధికారులను కేసీఆర్ ఆదేశించారు. […]

Update: 2020-11-07 11:17 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో హైదరాబాద్ నగర శివారులో సుమారు రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో సినిమా సిటీ నిర్మాణం కానుందని సీఎం పేర్కొన్నారు. సినీరంగానికి చెందిన ప్రముఖులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో శనివారం సమావేశమైన సందర్భంగా పై ప్రకటన చేశారు. సినీ ప్రముఖులు, అధికారుల బృందం బల్గేరియా వెళ్ళి అక్కడి సినిమా సిటీని పరిశీలించి రావాలని, ‘సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్’ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని సంబంధిత అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ఈ సినిమా సిటీలో సినీ నిర్మాణ సంస్థలకు కూడా ప్రభుత్వం స్థలాలను కేటాయిస్తుందని, అధునాతన సాంకేతిక నైపుణ్యాలతో, భవిష్యత్తు అవసరాలకు తగినట్టుగా అంతర్జాతీయ స్థాయిలో స్టుడియోలను నిర్మించుకోవచ్చని స్పష్టం చేశారు. ఎయిర్ స్ట్రిప్‌తో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలను కూడా ప్రభుత్వమే కల్పిస్తుందని స్పష్టం చేశారు.

ప్రగతి భవన్‌లో శనివారం ముఖ్యమంత్రితో సినీ నటులు చిరంజీవి, నాగార్జున తదితరులు సమావేశమైన అనంతరం ప్రభుత్వం ప్రకటన ద్వారా వివరించింది. అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమయినందున సినిమా షూటింగులు, సినిమా థియేటర్లను పునఃప్రారంభించవచ్చని సీఎం కేసీఆర్ ఈ సమావేశం తర్వాత ప్రకటించారు. తెలంగాణలో చిత్ర పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు పది లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందని, కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో షూటింగులు ఆగిపోయి, థియేటర్లు మూతపడి మందికి ఉపాధి పోయిందని సీఎం గుర్తుచేశారు. ఈ కుటుంబాలు అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, ఇప్పుడిప్పుడే కదాని తర్వాత ఒకటిగా మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయని గుర్తుచేశారు.

కొవిడ్ నిబంధనలు పాటిస్తూ షూటింగులు పునఃప్రారంభం కావాలని, థియేటర్లు కూడా ఓపెన్ కావాలని, తద్వారా చిత్ర పరిశ్రమపై ఆధారపడి బతికే కుటుంబాలు కష్టాల నుంచి బయట పడాలని కేసీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి, విస్తరణకు పుష్కలమైన అవకాశాలున్నాయని, కాస్మోపాలిటన్ నగరం కావడంతో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు, వివిధ భాషలకు చెందినవారు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారని గుర్తుచేశారు. ఎవరినైనా ఒడిలో చేర్చుకునే గుణం హైదరాబాద్‌కు ఉందని అన్నారు.

Tags:    

Similar News