ఇక తెరపై అమృత, ప్రణయ్‌ల ప్రేమకథ
దిశ, వెబ్‌డెస్క్: అమృత, ప్రణయ్‌ల ప్రేమ కథ గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ ఒక్కరికి తెలుసు. అంతగా సంచలనం సృష్టించింది ఈ ప్రేమ కథ. ప్రేమ పెళ్లి చేసుకున్న కన్న కూతురు అమృతను తన దగ్గరికి రప్పించుకునేందుకు అల్లుడు ప్రణయ్‌ను పరువుహత్య చేయించాడు మారుతీరావు. తర్వాత జైలు, కోర్టు గొడవలతో విసిగిపోయిన ఆయన … ఎన్నిసార్లు తన బిడ్డను కలుసుకునేందుకు ప్రయత్నించినా కుదరకపోవడంతో ఈ మధ్యే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. తద్వారా కూతురిపై చచ్చేంత లేదంటే చంపేంత […]
దిశ, వెబ్‌డెస్క్: అమృత, ప్రణయ్‌ల ప్రేమ కథ గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ ఒక్కరికి తెలుసు. అంతగా సంచలనం సృష్టించింది ఈ ప్రేమ కథ. ప్రేమ పెళ్లి చేసుకున్న కన్న కూతురు అమృతను తన దగ్గరికి రప్పించుకునేందుకు అల్లుడు ప్రణయ్‌ను పరువుహత్య చేయించాడు మారుతీరావు. తర్వాత జైలు, కోర్టు గొడవలతో విసిగిపోయిన ఆయన … ఎన్నిసార్లు తన బిడ్డను కలుసుకునేందుకు ప్రయత్నించినా కుదరకపోవడంతో ఈ మధ్యే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. తద్వారా కూతురిపై చచ్చేంత లేదంటే చంపేంత ప్రేమ ఉందని మారుతీరావు నిరూపించాడు. అయితే తన ప్రేమ కథలో అటు తండ్రి.. ఇటు భర్తను కోల్పోయిన అమృత మాత్రం చాలా నష్టపోయింది.
ఇదిలా ఉంటే అమృత, ప్రణయ్‌ల ప్రేమ కథ ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు శివనాగేశ్వర్ రావు. ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’ పేరుతో సినిమా రూపుదిద్దుకుంటుండగా… బాలాదిత్య, అర్చన హీరోహీరోయిన్లుగా కనిపించనున్నారు. సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, మాస్టర్ రవితేజలు కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమాకు ఎం.ఎన్. చౌదరి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమా గురించి మాట్లాడిన బాలాదిత్య … చిత్రంలో నా పాత్ర నిడివి తక్కువే అయినా.. కథ మొత్తం తన చుట్టూనే తిరుగుతుందన్నారు. సినిమా చేసే క్రమంలో ప్రణయ్ గురించి కొత్త విషయాలు తెలుసుకున్నానని చెప్పాడు.
Tags: Amruth, Pranay, Maruthi Rao, Annapurnamma Gaari Manavadu, Love Story, Baladitya, Archana