కోమటిరెడ్డికి దమ్ముంటే రాజీనామా చేయాలి.. మోత్కుపల్లి సవాల్
దిశ, తెలంగాణ బ్యూరో: ‘కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నీకు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి’ అని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాదులోని బేగంపేట్‌లో గల ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాసంక్షేమం కోసం పాటు పడుతున్నట్లు ప్రకటించడం కాదు రాజీనామా చేయాలని సవాల్ చేశారు. కోమటిరెడ్డి రాజీనామా చేస్తే డిపాజిట్ కూడా దక్కకుండా చేస్తానని వెల్లడించారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ‘దళితబంధు’ అడ్డుకునేందుకే కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. పేదలకు […]
దిశ, తెలంగాణ బ్యూరో: ‘కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నీకు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి’ అని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాదులోని బేగంపేట్‌లో గల ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాసంక్షేమం కోసం పాటు పడుతున్నట్లు ప్రకటించడం కాదు రాజీనామా చేయాలని సవాల్ చేశారు. కోమటిరెడ్డి రాజీనామా చేస్తే డిపాజిట్ కూడా దక్కకుండా చేస్తానని వెల్లడించారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ‘దళితబంధు’ అడ్డుకునేందుకే కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. పేదలకు ఈ పథకం అందకుండా చేయాలన్నదే వారి లక్ష్యం అని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల పేరు చెప్పి ఆస్తులు సంపాదించుకున్నారు తప్ప ఏమీ చేయలేదని వెల్లడించారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే అక్కడ విజయం సాధించేది టీఆర్ఎస్ పార్టీ అని తెలిపారు. ప్రజాసంక్షేమం కోసం చేసేవారు ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడారని అన్నారు.