మదర్స్ డే సందర్భంగా ఇది మీకు ప్రత్యేకం!
దిశ, వెబ్ డెస్క్: నేను నిన్ను కనలేదు. కానీ, ఆ కడుపు తీపి ఏంటో నాకు తెలుసు అని ఓ మూగజీవి మరో మూగ జీవి ఆకలి తీర్చింది. అందుకే ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోన్నది. విషయమేమిటంటే.. సుశంతా నందా అనే ఓ ఐఎఫ్ఎస్ అధికారి ట్విట్టర్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆకలితో ఉన్న ఓ కోతి పిల్లకు శునకం(కుక్క) పాలిస్తూ కనిపించింది. అంతేకాదు ఆ శునకంతోనే కోతిపిల్ల తిరుగుతూ కనిపిస్తది. అలా […]
దిశ, వెబ్ డెస్క్: నేను నిన్ను కనలేదు. కానీ, ఆ కడుపు తీపి ఏంటో నాకు తెలుసు అని ఓ మూగజీవి మరో మూగ జీవి ఆకలి తీర్చింది. అందుకే ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోన్నది. విషయమేమిటంటే.. సుశంతా నందా అనే ఓ ఐఎఫ్ఎస్ అధికారి ట్విట్టర్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆకలితో ఉన్న ఓ కోతి పిల్లకు శునకం(కుక్క) పాలిస్తూ కనిపించింది. అంతేకాదు ఆ శునకంతోనే కోతిపిల్ల తిరుగుతూ కనిపిస్తది. అలా ఆ కోతిని అల్లారు ముద్దుగా చూసుకుంటున్న విషయం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తది. అమ్మతనానికి అచ్చం అద్దం పట్టేలా ఆ శునకం వ్యవహరించిన తీరు ఆదర్శంగా నిలిచింది. తన జాతికి చెందిన జంతువు కాకపోయిన కూడా ఆ కోతిపిల్ల ఆకలి తీర్చి తన బిడ్డలాగే చూసుకుంది. నేడు మదర్స్ డే సందర్భంగా ఆ శునకాన్ని మనం మెచ్చుకోవాల్సిందే. అదేవిధంగా ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు.
Motherhoods is not only through biology/ DNA🙏 pic.twitter.com/iURDZRGD10
— Susanta Nanda IFS (@susantananda3) May 10, 2020