రూ.50 వేలకు బిడ్డను విక్రయించిన కన్న తల్లి
దిశ ప్రతినిధి, నిజామాబాద్: తెలిసిన వ్యక్తి చేతిలో అఘాయిత్యానికి గురైంది ఓ మహిళ. దాని కారణంగా దాల్చిన గర్భంతో సమాజంలో తలెత్తుకోలేక పుట్టిన బిడ్డను అమ్మకానికి పెట్టి ఇప్పుడు కటకటాలు లెక్కించాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. ఈ ఘటన నిజామాబాద్లో చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలానికి చెందిన ఓ మహిళపై గత సంవతసరం ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై రెంజల్ పోలీసు స్టేషన్ లో బాధిత మహిళా ఫిర్యాదు చేయగా.. నిందితున్ని అరెస్ట్ చేసి పోలీసులు […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్: తెలిసిన వ్యక్తి చేతిలో అఘాయిత్యానికి గురైంది ఓ మహిళ. దాని కారణంగా దాల్చిన గర్భంతో సమాజంలో తలెత్తుకోలేక పుట్టిన బిడ్డను అమ్మకానికి పెట్టి ఇప్పుడు కటకటాలు లెక్కించాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. ఈ ఘటన నిజామాబాద్లో చోటుచేసుకుంది.
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలానికి చెందిన ఓ మహిళపై గత సంవతసరం ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై రెంజల్ పోలీసు స్టేషన్ లో బాధిత మహిళా ఫిర్యాదు చేయగా.. నిందితున్ని అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ కు తరలించారు. అప్పటికే సదరు బాధిత మహిళ గర్భం దాల్చింది. నెల రోజుల క్రితం పండంటి పాపకు బోధన్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మనిచ్చింది. అయితే తల్లి బిడ్డలకు రక్తహీనత కారణంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే ఆ అక్రమ సంతానాన్ని వద్దనుకున్న ఆ తల్లి వదిలించుకోవాలని అనుకుంది. వారం రోజుల క్రితం రూ.50 వేలకు నగరానికి చెందిన మరో మహిళతో బేరం కుదుర్చకుని విక్రయించింది. విషయం తెలుసుకున్న 1టౌన్ పోలీసులు పాపను ఐసీడిఎస్ అధికారులకు అప్పగించారు. పాపను విక్రయానికి పాల్పడ్డ తల్లి, మరో 8 మందిపై 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.