రూ. 100 కోట్ల అమ్మకాల లక్ష్యం: మదర్ డెయిరీ

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ పాల సరఫరా సంస్థ మదర్ డెయిరీ తన స్వీట్ల పోర్ట్‌ఫోలియోలో మరో రెండు స్వీట్లను ప్రవేశపెట్టినట్టు వెల్లడించింది. దేశీయంగా ఆదరణ కలిగిన మధుర పేడా, మేవా ఆటా లడ్డూ స్వీట్లను తమ పోర్ట్‌ఫోలియోలో కొత్తగా జత చేసినట్టు తెలిపింది. అంతేకాకుండా మదర్ డెయిరీ ఈ విభాగంలో రాబోయే రెండు మూడేళ్లకు రూ. 100 కోట్ల అమ్మకాలను సాధించాలని లక్ష్యంగా ఉన్నట్టు స్పష్టం చేసింది. మదర్ డెయిరీ సంస్థ దేశవ్యాప్తంగా అనేక నగరాలకు పాలను, […]

Update: 2021-01-15 05:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ పాల సరఫరా సంస్థ మదర్ డెయిరీ తన స్వీట్ల పోర్ట్‌ఫోలియోలో మరో రెండు స్వీట్లను ప్రవేశపెట్టినట్టు వెల్లడించింది. దేశీయంగా ఆదరణ కలిగిన మధుర పేడా, మేవా ఆటా లడ్డూ స్వీట్లను తమ పోర్ట్‌ఫోలియోలో కొత్తగా జత చేసినట్టు తెలిపింది. అంతేకాకుండా మదర్ డెయిరీ ఈ విభాగంలో రాబోయే రెండు మూడేళ్లకు రూ. 100 కోట్ల అమ్మకాలను సాధించాలని లక్ష్యంగా ఉన్నట్టు స్పష్టం చేసింది.

మదర్ డెయిరీ సంస్థ దేశవ్యాప్తంగా అనేక నగరాలకు పాలను, పాల ఉత్పత్తులను సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సంస్థ పాలతో పాటు ఆరు రకాల స్వీట్లను అందిస్తోంది. మిల్క్ షేక్, ఆరెంజ్ మవా బర్ఫీ, ఫ్రోజెన్ రస్మలై, రోజ్ జామూన్, రసగుల్లా రకాలు ఉన్నాయి. ఈ స్వీట్లు సరైన భద్రతా ప్రమాణాలతో తయారు చేశామని, ఈ ఉత్పత్తులను అమెజాన్, మిల్క్‌బాస్కెట్, బిగ్ బాస్కెట్ వంటి అవుట్‌లెట్ల ద్వారా కూడా విక్రయిస్తున్నట్టు మదర్ డెయిరీ తెలిపింది.

Tags:    

Similar News